Congress demands action against BJP MP ఎంపీ కాళ్లు కడిగిన కార్యకర్త ఏం చేశాడంటే..

Bjp mp slammed for allowing party man to wash his feet

Bharatiya Janata Party, BJP, BJP mp, Godda BJP MP, MP Nishikant Dubey, nishikant dubey, washing feet, BJP worker Pawan Shah, Pawan Shah, Tajia river bridge, Kanbhari and Kalali village, Godda, Facebook, politics

Godda BJP MP Nishikant Dubey has landed himself in controversy for allowing a party worker to wash his feet and then drink the water that was used for washing the feet.

ఎంపీ కాళ్లు కడిగిన కార్యకర్త ఏం చేశాడంటే..

Posted: 09/17/2018 05:26 PM IST
Bjp mp slammed for allowing party man to wash his feet

బీజేపి కార్యకర్తల స్వామి భక్తి పరాకాష్టకు చేరిందా.? అంటే ఈ సంఘటన అవుననే అంటుంది. ఏకంగా తమ పార్టీ ఎంపీ కాళ్లు కడిగిన ఓ కార్యకర్త.. చేసిన పని ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశమైంది. అది చాలదన్నట్లు ఆ సంఘటనను తన ఫేస్ బుక్ ప్రోఫైల్ లో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఇంకేముంది.. సదరు ఎంపీని సాధించిన ఘనత అంతా ఈ చిన్న ఘటన కొట్టిపారేస్తూ ఆయనను విమర్శల పాలుజేసింది.

నాయకులు అభిమానులను హద్దుల్లో వుంచుకోవాలి. అంతేకానీ వారు హద్దు మీరి చేసే పనులు కూడా నేతలను అబాసుపాలు చేస్తాయని ఈ ఘటన నిరూపిస్తుంది. తాజాగా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన గొడ్డా పార్లమెంటు సభ్యుడు నిషికాంత్ దూబే పై ఆయన అనుచరుడి అభిమానం హద్దులు దాటింది. బీజేపి కార్యకర్త తన స్వామిభక్తిని చాటుకునే ప్రయత్నంలో భఆగంగా ఎంపీ కాళ్లు కడిగారు. ఇంతవరకు ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత ఆయన చేసిన పనే దూబేను విమర్శలపాలు చేస్తుంది.

వివరాల్లోకి వెళితే..జార్ఖండ్‌కు చెందిన గొడ్డా బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  పవన్‌ సింగ్‌ అనే కార్యకర్త సభకు హాజరైన వందలాది మంది సాక్షిగా...ఎంపీ కాళ్లు కడిగి, అనంతరం ఆ నీళ్లను పవిత్ర గంగాజలంగా సేవించాడు. ఈ తతంగాన్ని అంతా ఓ కార్యకర్త వీడియో తీయడం, దానిని నెటింట్లో పోస్టు చేయడంతో కూడా పెద్దగా వైరల్ కాలేదు. అయితే ఈ వీడియోను ఎంపీ తన ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో వైరల్ కావడంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలకు దారి తీసింది.

అయితే బీజేపి పార్టీకి చెందిన ఎంపీ మాత్రం తన కాళ్లు కడగడాన్ని సమర్థించుకున్నారు. ఆ పాదపూజపై పలువురు సమర్థించినా, పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. ఈ చర్యను ఎందుకు రాజకీయ రంగు పులుముతారంటూ, అతిథుల కాళ్లు కడగటం మన సంప్రదాయమని, పురాణాల్లో కూడా ఉందంటూ ఎంపీ నిషికాంత్ దూబే చెప్పుకొచ్చారు. చవకబారు ఆలోచనలు చేయడం సరికాదని, ​కాళ్లు కడిగిన నీటిని తాగడంలోనూ ఏమాత్రం తప్పులేదని ఎంపీ వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Godda BJP MP  MP Nishikant Dubey  Pawan Shah  Godda  Facebook  Jharkhand  politics  

Other Articles