అల్లు ఈ ఇంటి పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు, మరోలా చెప్పాలంటే తెలుగు రాష్ట్ర ప్రజలు లేరు. దక్షిణాధి రాష్ట్రాల్లోనూ అనేక మంది ప్రజలకు ఈ పేరు పరిచితం. అల్లు అర్జున్ హారోగా రాణిస్తుడటం.. అన్న బాటలోనే తమ్ముడు అల్లు శిరీష్ కూడా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను రంజింపజేసేందుకు సిద్దం కావడంతో.. ఒకే ఇంటిపేరుతో ఇద్దరు హీరోలు తెరపైకి రావడంతో అల్లు పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో వారికున్న అదరణతో మార్మోగిపోతుందనడంలో సందేహం లేదు.
దీంతో పాటు అటు మెగాస్టార్ చిరంజివి.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, వీరితో పాటు మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ కుటుంబంతో అల్లు కుటుంబానికి వున్న అనుబంధం కూడా అల్లు వారి ఇంటి పేరు చిత్రసీమతో పాటు సినీ ప్రేక్షకులలో పదే పదే వినిపించడానికి కలసిసోచ్చిందనే చెప్పాలి. అందుకు బీజం వేసింది మాత్రం అల్లు అరవిందుడేనని చెప్పాలి. తన తండ్రి అల్లు రామలింగయ్య చూపిన బాటలో అడుగులెయ్యాలని భావించినా.. తెలుగు చిత్రసీమలో తనకు నిర్మాణ రంగమే తృప్తినిస్తుందని సరిపెట్టుకునన్నారు.
అనేక అద్భుత చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. గీతా అర్ట్స్ బ్యానర్ లో ఆయన అటు నిర్మాతగా, ఇటు పంఫిణీదారుడిగా కూడా సేవలను అందిస్తున్నారు. అయితే తన తండ్రిలా నటుడిగా కనిపించాలన్న తన పిసాసను పలు చిత్రాల్లో నటించి తీర్చుకున్నారు. అల్లు అరవింద్. ముఖ్యంగా చంటబ్బాయ్ చిత్రంలో పోషించిన పాత్రను ఆయన చాలా గుర్తింపును తీసుకువచ్చింది.
నటనలో తన తండ్రి అడుగుజాడల్లో రాణించలేకపోయినా.. చిత్రసీమకు నిర్మాతగా అందించిన సేవలతో అందుకున్న అవార్డుల విషయంలో మాత్రం ఆయన తన తండ్రి సరసన నిలిచారు. 2001లో అల్లు రామలింగయ్య రఘుపతి వెంకయ్య అవార్డును అందుకోగా అల్లు అరవింద్ 2018లో అదే ప్రతిష్టాత్మక అవార్డును అగ్రరాజ్యంలో అందుకున్నారు. అల్లు అరవింద్ కు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న తరుణంలో ఆయన తండ్రిని గుర్తుచేసుకున్నారు.
ఆయన ఈ అవార్డును అందుకోడానికి, ఇంతటి ఖ్యాతిని అర్జించడానికి మూలవిరాట్ అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్యే అని చెప్పడం అతిశయోక్తి కాదు. పేరులోనే హాస్యం ఇమిడివుందా అనేలా.. తనదైన మాటలు, అదే సమయంలో తన హావభావాలతో అద్భుత నటనకు మారుపేరు అల్లు రామలింగయ్య. హాస్యాన్ని పండించడంలో దిట్టగా ముద్రపడి.. ఆయన లేకుండా.. ఆయనకు పాత్ర లేకుండా చిత్రాలు తీయడమా.? అనేలా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన నటుడాయన.
అటు హాస్యమైనా, ఇటు పెద్దమనిషి తరహా నటనకైనా.. లేక ప్రతినాయకుడి తరహా సన్నివేశాలకైనా ఆయన అందవేసిన నటుడు. అయితే హాస్యంతోనే తెలుగు ప్రేక్షకులను చేరువైన ఆయన.. తన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. చారిత్రక కాలంలో కవిత్వంలో పలు ప్రక్రియలు చేపట్టి కవ్వించి , నవ్వించి ' వికటకవి గా తెనాలి రామలింగడు చరితార్థుడైతే , ఈనాటి సినీసీమలో అలాంటి స్థాన్నాన్ని పొందినవాడు అల్లు రామలింగయ్య. అయితే ఈ తరంవారికి అల్లు రామలింగయ్య ఎవరు.? అన్న సందేహాటు ఉత్పన్నం కావచ్చు.
అల్లు రామలింగయ్య.. తెలుగు చలనచిత్రసీమలో పేరొందిన నటుడు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన హాస్యాన్ని పండించడంతో పాటు తన భావలతోనే ప్రేక్షకుల కంట కన్నీరు పెట్టించగల నటుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లో 1922 అక్టోబర్ 1న అల్లు వెంకన్న, అల్లు సీతమ్మల ఇంట జన్మించిన అల్లు రామలింగయ్యకు చిన్ననాటి నుంచి అనుకరణ అంటే అమితాసక్తి. పెద్దగా చదువు పెద్దగా అబ్బకపోయినా.. తన సహచరులతో కలసి ఆకతాయిగా తిరుగుతూ అందరినీ అనుకరిస్తూ నవ్వించేవాడు. ఇదే క్రమంతో నాటకాల్లో నటించాలనే ఉత్సాహం కలిగింది.
అప్పట్లో గ్రామాల్లో అధికంగా నటకాలకే ప్రాధన్యత వుండేది. ఈ క్రమంలో ఊళ్లోకి ఎవరు నాటకాల వాళ్ళు వచ్చినా వారి వెంటే తిరుగుతూ వాళ్లతో స్నేహం చేయడం, ఏదైనా చిన్న వేషం ఇమ్మని అడగేవారు అల్లు రామలింగయ్య. ఎట్టకేలకు భక్త ప్రహ్లాద నాటకంలో బృహస్పతి వేషం వేసే అవకాశం వచ్చింది. అదీ మూడు రూపాయలు ఎదురిచ్చేట్టుగా ఇంట్లో వాళ్ళకి తెలియకండా వేసాడు. నాటకానుభవం పెద్దగా లేకున్నా కొద్దిపాటి నటనావగాహనతో తన వేషం మెప్పించాడు.
ఆ తరువాత ఇంట్లోంచి బియ్యం దొంగతనం చేసి వాటిని అమ్మి నాటక కాంట్రాక్టరుకు ఇచ్చాడు. అలా మొదలైనంది ఆల్లు నట జీవితం. అక్కడి నుంచి ప్రేక్షకులను మెప్పించే స్థాయిలో నాలకాలు వేసే స్థాయికి ఎదిగారు. ఇలా నటనారంగంలో ఆయనకున్న పట్టు ఆయనకు సినిమాలలో అవకాశం కల్పించింది. అల్లు నాటాకాలు చూసిన గరికపాటి రాజారావు చిత్రసీమలో తొలిసారిగా 1952లో పుట్టిల్లు చిత్రంలో కూడు-గుడ్డ శాస్త్రి తరహా పాత్రను అల్లుచే వేయించాడు. ఆ తరువాత హెచ్.ఎం.రెడ్డి వద్దంటే డబ్బులో అవకాశం వచ్చింది.
అప్పటికే నలుగురు పిల్లల తండ్రిగా వున్న అల్లు రామలింగయ్య.. సినీ అవకాశాల కోసం మద్రాసుకు మకాం మార్చాడు. అయితే కుటుంబ పోషణ అరవ రాష్ట్రంలో అనేక కష్టాలు పడ్డాడు. కాగా, 1954లో వచ్చిన పల్లె పడచు చిత్రం నుంచి ఆయన నటుడిగా స్థిరపడ్డాడు. మిస్సమ్మ, దొంగరాముడు చిత్రాలతో ఆయన నటనకు గుర్తింపును తీసుకువచ్చియి. ఇలా ఆయన నటిస్తూనే ఆయన దాదాపుగా 6 దశాబ్దాలు చిత్రసీమకు నటుడిగా ఎనలేని సేవలు అందించారు. సినీ రంగానికి వచ్చిన తొలినాళ్లలో ఆయన బిజిగా వున్నా.. తాను నేర్చుకున్న హోమియో వైద్యంతో పేదలకు ఉచిత వైద్యసేవను అందించేవాడు.
అరవై వసంతాల పాటు సినిమాల్లో నవ్వుతూ.. తెలుగువారిని నవ్వించిన అల్లును ఎన్నో అవార్డులు వరించాయి. భారత ప్రభుత్వం 1990 లో 'పద్మశ్రీ' తో గౌరవించింది. ఆ తరువాత 2001లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళాకారులకు అందించే అత్యున్నత 'రఘుపతి వెంకయ్య' పురస్కారాన్ని అందించింది. ఆయన చిత్రసీమలో సాధించిన పేరుతోనే ఆయన తన కుమారుడు అల్లు అరవింద్ ను నిర్మాతగా స్థిరపడటంలోనూ దోహదపడ్డారు. అల్లు రామలింగయ్య 2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట కన్నుమూసారు. అప్పటివరకు ఆయనకు తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం వుంది. అదే ఒరలోని కత్తిగా ఇటు అల్లు అరవింద్ కూడా చిత్రసీమ రంగానికి ఎనలేని సేవలు అందించారు.
తన తండ్రికి అడుగుజాడల్లో నటుడిగా రాణించడం ఇష్టంలేని అరవింద్.. చిత్రసీమలోనే నిర్మాతగా రాణించాలని అడుగులు వేశాడు. 1974లో బంట్రోతు భార్య చిత్రం ద్వారా నిర్మాతగా అరంగ్రేటం చేశాడు. ఆ తరువాత దేవుడే దిగివస్తే అన్న చిత్రాన్ని 1975లో నిర్మించాడు. ఈ రెండు చిత్రాలు విజయాలను అందుకున్నా.. అనుకున్న స్థాయిలో అడలేదు. దీంతో ఏడేళ్ల పాటు దూరంగా వున్న ఆయన 1982లో కే.విశ్వనాథ్ దర్శకత్వంలోని శుభలేక చిత్రంతో పునరాగమనం చేశారు. అదే ఏడాది యమకింకరుడు చిత్రంతో మరో హిట్ సాధించారు.
ఇక అక్కడి నుంచి గీతా అర్ట్స్ ఎన్నో అద్భుత చిత్రాలను నిర్మించింది. పునరాగమనంతో తన బావ ( సోదరి సురేఖ భర్తతో) చిరంజీవి హీరోగానే సినిమాలను నిర్మించిన అరవింద్.. ఆ తరువాత అనేక చిత్రాలను నిర్మించారు. ఇటు తెలుగు చిత్రరంగంలో నేరుగా చిత్రాలను నిర్మించడంతో పాటు అటు పరబాష చిత్రాలను తెలుగులో డబ్ చేయడంతో పలు చిత్రాలను రిమేక్ చేయడంతో కూడా చేపట్టారు. ప్రతిబంద్ చిత్రంతో అటు బాలీవుడ్ రంగంలోకి కూడా గీతా అర్ట్స్ ఎంట్రీ ఇచ్చింది. దీంతో పాటు ప్రస్తుతం ఆల్లు కుమారులు కూడా చిత్రరంగంలో హీరోలుగా స్థిరపడ్డారు.
ఇలా అల్లు అరవింద్ కూడా దాదాపుగా ఐదు దశాబ్దాలుగా చిత్రరంగానికి నిర్మాతగా సేవలందిస్తున్న తరుణంలో ఆయనకు అగ్రరాజ్యంలోని అమెరికన్ ప్రగతిశీల తెలుగు అసోసియేషన్ ఆయనకు రఘుపతి వెంకయ్య అవార్డును అందించి సత్కరించింది. 2008లో ప్రారంభమైన అమెరికన్ ప్రోగెసివ్ తెలుగు అసోసియేషన్ పదేళ్లను పూర్తి చేసుకున్న శుభతరుణంలో నిర్వహించిన దశాబ్ద వేడుకలలో బాగంగా అల్లుఅరవింద్ కు ప్రతిష్టాత్మక అవార్డును అందించింది.
తెలుగు చిత్రసీమలోని కళాకారులకు లభించే అత్యున్నత పురస్కారం రఘుపతి వెంకయ్య అవార్డు. ఇంతకీ రఘుపతి వెంకయ్యనాయుడు అంటే ఎవరో తెలుసా.? చిత్రసీమ అభివృద్దికి, అభ్యున్నతి కోసం తొలినాళ్లలోనే అనేక కష్టాలు పడిన ఆయన.. ఎన్నో అటుపోట్లను, ఎన్నో కష్టనష్టాలను చవిచూసి.. విదేశాల నుంచి కెమెరాలను తెప్పించుకుని మరీ మూకీ చిత్రాలకు శ్రీకారం చుట్టి.. తెలుగు చలనచిత్ర రంగం అవిర్భవించడానికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు. మరోమాటలో చెప్పాలంటే రఘుపతి వెంకయ్య.. తెలుగు చలనచిత్ర పితామహుడు. అటు సినిమా ఇటు టాకీసుల నిర్మాణాలకు నాంది పలికిన.. మూకీ సినిమాల నుంచి టాకీ సినిమాల వరకు చిత్రసీమ అభివృద్దికి ఎంతో కృషిసల్పిన ఘనుడు. దక్షిణభారత దేశంలో తొలి మూకీ చిత్రం ‘కీచకవధ’ 1916 లో నటరాజ మొదలియార్ నిర్మించగా, తెలుగులో మాత్రం తొలి మూకీ చిత్రానికి నాంది పలికి నిర్మాణం చేసింది రఘుపతి వెంకయ్యనాయుడు.
కాగా అప్పట్లో అన్ని టూరింగ్ టెంట్ టాకీసులే వుండటంతో.. ఊరూరా తిరుగుతూ మూకీ సినిమాలను ప్రదర్శించారు. అప్పడప్పుడే బీజాలు వేసుకుంటున్న సినిమాలకు టాకీసులు లేకపోవడంతో అందుకు అంకురార్పణ చేశారు రఘుపతి వెంకయ్య. సినిమా టాకీసు కట్టడంలో ఆయన అనేక కష్టాలూ, అవస్థలూ పడ్డారు. ప్రభుత్వాధికారులు మరీ ముఖ్యంగా విద్యుత్ ఇన్‌స్పెక్టర్లూ, శానిటరీ ఇన్‌స్పెక్టర్లూ ప్రతీసారీ వచ్చి ‘అది మార్చు, ఇది మార్చు అంటూ ఎన్నో అవాంతరాలు సృష్టించారని ఆయన తన డైరీలో రాసుకున్నారు.
ఒక థియేటర్ కట్టడానికి అంగీకరించి, లైసెన్స్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వ అధికారులు.. తాము సూచించిన మార్పులు చేయకపోతే లైనెన్స్ రద్దు చేస్తామని పేచీలు పెడుతూ అనేక అభ్యంతరాలు చెప్పారు. ఇలా ఒకటి రెండు కాకుండా అనేక కష్టాలు, నష్టాలు, అభ్యంతరాలు, అవాంతరాలు ఎదుర్కోన్న మరెవ్యక్తి అయినా ఇక ఆ రంగం నుంచి తప్పుకునే వారనీ, కానీ తాను మాత్రం తాను పట్టుపట్టి అంతు చూడాలనుకున్నాననీ, ఆ అంకుఠిత దీక్షతోనే తాను టాకీసుల నిర్మాణం చేయగలిగానని కూడా ఆయన తన డైరీలో రాసుకున్నారు.
1912లో చెన్నై అప్పటి (మదరాసు) నగరంలో 'గెయిటీ' అనే సినిమా టాకీసును నిర్మించారు. తరువాత 'క్రౌన్', 'గ్లోబ్' సినిమా హాళ్లను కూడా నిర్మించారు. అయితే అన్ని పరిస్థితులు ఒకలా వుండవన్నది, అన్ని సమయాల్లో కలసి రావన్నది ఎంత నిజమో రఘుపతి వెంకయ్యకు అప్పుడే తెలుసుకున్నారు. నిర్మాణం మధ్యలో ఆగిపోయి తీవ్రమైన నష్టం కలిగించిందనీ, ఈ బాధలు భరించలేక ఇంకొకరైతే, ఈ వ్యాపారానికి స్వస్తి చెప్పేవారనీ, కూడా రఘుపతి వెంకయ్య తన డైరిలో రాసుకున్నారు.
అయినా ఆయనకు చిత్రసీమపై వున్న అసక్తి, అభిమానం, ఆరాధన మాత్రం దూరం కాలేదు. తాను సాధించాలని ఎంతో కష్టపడినా.. తొలినాళ్లలో ఫలితాలు మాత్రం అంతంతమాత్రగానే వున్నాయని ఆయన తన అవేదనను అధిగమించేందుకు ఇంకా ఎదో చేయాలన్న ప్రయత్నాలను మాత్రం చివరి వరకు సాగించారు. తాన పడిన కష్టాలు తన కొడుకు పడకూడదని బావించే తండ్రులున్న ఈ సమాజంలో.. తన కొడుకు రఘుపతి సూర్యప్రకాష్ (ఆర్.ఎస్.ప్రకాష్) ను కూడా చిత్రసీమలోనే నిర్మాణ, దర్శకత్వ రంగాలలో నైపుణ్యం పెంచుకుని, రాణించేందుకు విదేశాలకు పంపి.. అక్కడ తర్పీదు తీసుకోమ్మని పంపారు.
తెలుగు పరిశ్రమను అభివృద్ది పథంలో నడిపించేందుకు నిత్యం శ్రమించిన మహనీయుడు రఘుపతి వెంకయ్యనాయుడు. ఆయన చిత్ర రంగానికి అందించి సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 1980 వ సంవత్సరం నుంచి ఆయన పేరున కళాకారులకు అత్యున్నత పురస్కారాన్ని అందించేందుకు శ్రీకారం చుట్టుంది. చిత్రసీమ అభ్యున్నతికి తమ వంతుగా కృషి చేసిన నిర్మాణ, దర్శకత్వం, నటన, కొరియోగ్రఫీ సహా పలు రంగాలలో విశేష సేవలందించిన మహనీయులకు ఈ అవార్డులను ప్రధానం చేయడం అనవాయితీగా వస్తుంది. కాగా ఈ అవార్డును ఆప్త తొలిసారిగా అల్లు అరవింద్ నిర్మాణ రంగంలో చేసిన కృషికి అందించడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more