Goa CM shifted to AIIMS in New Delhi ఎయిమ్స్ అసుపత్రికి మనోహర్ పారికర్..

Goa cm manohar parrikar shifted to aiims in new delhi

Goa, Manohar Parrikar, AIIMS, BJP, pancreatic ailment, North Goa, Candolim, parrikar health condition, parrikar health, manohar parrikar in aiims, parrikar aiims, goa chief minister, goa politics, congress

Ailing Goa CM Manohar Parrikar headed to the national capital via a special chartered flight for further treatment and examination at AIIMS.

ఎయిమ్స్ అసుపత్రికి మనోహర్ పారికర్.. అనారోగ్యమే కారణం

Posted: 09/15/2018 11:17 AM IST
Goa cm manohar parrikar shifted to aiims in new delhi

అనారోగ్యంతో బాదపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ మెరుగైన వైద్యం కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం పారికర్‌ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారని గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా.. పారికర్‌ ఆరోగ్య సమస్యల దృష్ట్యా తరచూ ఆయన విధులకు సెలవు పెట్టాల్సి వస్తోంది. దీంతో పాలనా పగ్గాలను తాను ఇతరులకు అప్పగించేందుకు కూడా సుముఖమని వెళ్లడించినట్లు వార్తలు వెల్లడవుతున్నాయి.

ఈ విషయమై ఇప్పటికే ప్రధాని మోదీ, భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో చర్చించినట్లు సమాచారం. ముందుగా తన అరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలని హితవు పలికిన ప్రధాని ఆయనను ఎయిమ్స్ అసుపత్రికి రావాలని.. ఇక్కడ నిపుణులైన వైద్యులతో చికిత్స చేయించుకోవాలని సూచించారు. ఈ మేరకు పారికర్ ను ఎయిమ్స్ అసుపత్రికి తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏర్పాటు చేశారని తెలుస్తోంది. కాగా, ముఖ్యమంత్రి పారికర్ అనారోగ్యం కారణంగా పాలన వ్యవస్థ దెబ్బతింటోందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. వెంటనే గోవాలో రాష్ట్రపతి పాలన తీసుకురావాలని డిమాండ్‌ చేస్తోంది.

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం తాను సీఎంగా కొనసాగలేనని పారికర్.. మోదీ, అమిత్‌షాలను చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం కాస్త కష్టమని, అందుకే తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు సీఎంగా కొనసాగాలని పారికర్‌కు అమిత్‌షా సూచించినట్లు తెలుస్తోంది. ప్యాంక్రియాటిక్‌ సమస్యతో బాధపడుతున్న పారికర్‌ ప్రస్తుతం గోవాలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలోనూ చికిత్స తీసుకున్న ఆయన.. అమెరికాకు కూడా వెళ్లి మూడు నెలలపాటు వైద్యం తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manohar parrikar  francis d'souza  Bharatiya Janata Party  Michael Lobo  Goa  panaji  congress  politics  

Other Articles