house arrest extended to human rights activists వరవరరావు గృహనిర్భంధం పొడగింపు..

Bhima koregaon case sc extends house arrest of activists till sept 17

Supreme court, Varavara Rao, lawyer Sudha Bharadwaj, Arun Fereira, Gautam Navlakha, Vernon Gonsalves, Pune Police, elgaar parishad, elgaar parishad event, elgaar parishad activists arrested, bhima koregaon violence, Pune Police, crime

The Supreme Court on Wednesday, September 12 extended the house arrest of five rights activists who were arrested in connection with the Bhima Koregaon violence case till September 17.

వరవరరావు గృహనిర్భంధం పొడగింపు.. ఆయనతో పాటు మరో నలుగురికి..

Posted: 09/14/2018 11:43 AM IST
Bhima koregaon case sc extends house arrest of activists till sept 17

విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గృహ నిర్బంధాన్ని పొడిగిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని అత్యున్నన న్యాయస్థానం ధర్మాసనం వరవరరావు సహా మరో నలుగురు మానవ హక్కుల నేతలైన  గౌతమ్ నవలఖ, సుధ భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వెర్నాన్ గొంజాల్వెస్ ల గృహ నిర్బంధాన్ని ఈనెల 17 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రధాని నరేంద్రమోడీ హత్యకు కుట్ర పన్నారని, మోడీ హత్యకు అవసరమైన నిధులు తదితరలాను సమకూర్చే బాధ్యతలను నెత్తికెత్తుకున్నారన్న అభియోగాలను మోపుతూ.. ఈ ఐదుగురు మానవ హక్కుల నేతలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీనికి తోడు వీరందరూ మావోయిస్టుల సానుభూతిపరులనే ఆరోపణలను కూడా వున్నాయి. భీమా-కొరెగావ్ హింసాత్మక సంఘటనల కేసులో లభించిన ఆదారాల మేరకు వీరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

మరోవైపు, తన భర్తకు వైద్యం నిమిత్తం డాక్టర్‌ను అనుమతించాలంటూ వరవరరావు భార్య హేమలత దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నిన్న స్పందించింది. వరవరరావుకు చికిత్స అందించేందుకు గాంధీ ఆసుపత్రి సీనియర్ ఫిజీషియన్‌ను ఆయన ఇంటికి పంపాలని రాష్ట్ర డీజీపీని ఆదేశించింది. వరవరరావుకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాలని జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, జస్టిస్ శ్యామ్ ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం సూచించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles