OU student suicide attempt at Raj bhavan రాజ్ భవన్ వద్ద ఓయూ పూర్వవిద్యార్థి ఆత్మహత్యాయత్నం

Former osmania university student suicide attempt at raj bhavan

K. Chandrasekhara Rao, TRS, KCR, Nizam college, former student, boppana Eshwar, suicide attempt, Raj bhavan, uttam kumar reddy, central election commission, congress, Telangana cabinet meet, Telangana, Politics

Former Nizam college student boppana Eshwar attempts suicide at Raj bhavan, demanding that KCR had done nothing for Telangana mytrs even after including them into his party account.

ITEMVIDEOS: రాజ్ భవన్ వద్ద ఓయూ పూర్వవిద్యార్థి ఆత్మహత్యాయత్నం

Posted: 09/06/2018 06:46 PM IST
Former osmania university student suicide attempt at raj bhavan

రాజ్ భవన్‌ లో గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీయై బయటకు వెళ్లిన కొద్ది నిమిషాల వ్యవధిలో ఓ వ్యక్తి రాజ్ భవన్ వెలుపల ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఆయా పరిసరాల్లో పూర్తిగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన క్రమంలో ఒక వ్యక్తి రాజ్ భవన్ గేట్‌ వద్దకు వచ్చి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాం కళాశాల పూర్వ విద్యార్థి బొప్పన ఈశ్వర్ గా పోలీసులు అతన్ని గుర్తించారు.

రాజ్ భవన్ గేటు వద్దకు వచ్చిన ఈశ్వర్ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకున్నాడు. అది గమనించిన రక్షణ సిబ్బంది అతన్ని నిలువరించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పూర్వ విద్యార్థిని వారు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులకు ఏం చేశారంటూ ఈశ్వర్‌ సీఎం కేసీఆర్ ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు ఏమీచేయలేదని, ఉద్యోగాలు కూడా రాలేదని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

తమ త్యాగాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ చాకచక్యంగా తన ఖాతాలో వేసుకున్నారని.. అరోపించిన ఈశ్వర్ ఉద్యోగాలు కల్పిస్తానని హామీలు గుప్పించి తమ విద్యార్థి లోకాన్ని అశల కడలిలో నిండా ముంచాడని అరోపించారు. ఇక తాజాగా తమకెవరికి చెప్పకుండానే శాసన సభను రద్దు చేశారని దీనికి నిరసనగా రాజ్ భవన్‌ వద్ద ఈ ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టినట్లు తెలిపాడు. గతంలో ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రస్తుతం నిర్బంధంలో ఉంచారని బొప్పన ఈశ్వర్ వాపోయాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Nizam college  former student  boppana Eshwar  suicide attempt  Raj bhavan  Telangana  Politics  

Other Articles