Congress Leader To Buy "Safe Plane" For Rahul 20 సెకన్ల వ్యవధే రాహుల్ ను కాపాడింది.. అందుకనే

Congress leader offers to sell house to buy safe plane for rahul gandhi

rahul gandhi, Ashok Jaiswal, charter plane, karnataka election, pilot, Indira gandhi, Rajiv Gandhi, congress mukt bharat, healthy democracy, congress, politics

A Congress leader from Madhya Pradesh has put out newspaper ads to sell his house and shops, saying he wants to buy a "safe plane" for his party president Rahul Gandhi.

20 సెకన్ల వ్యవధే రాహుల్ ను కాపాడింది.. అందుకనే

Posted: 09/05/2018 02:57 PM IST
Congress leader offers to sell house to buy safe plane for rahul gandhi

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో కర్నాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన క్రమంలో ఆయన విమానం సాంకేతిక లోపానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై దర్యాప్తు చేసిన అధికారులు రాహుల్ గాంధీ మరో 20 సెకన్ల పాటు అదే విమానంలో వుండివుంటే అత్యంత దారుణం జరిగేదని, విమానం క్రాష్ అయ్యేందుకు 20 సెకన్ల ముందు రాహుల్ దిగిపోయారని వార్తలు వచ్చాయి. అందుకు పూర్తిగా సాంకేతిక లోపాన్ని గుర్తించని పైలెట్లదే తప్పిదమని కూడా డీజీసీఏ పేర్కొంది.

దీంతో నీతి, నిజాయితికి మారుపేరైన తమ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కోసం అత్యంత భద్రతతో కూడిన విమానం కొనేందుకు మధ్యప్రదేశ్ కు చెందిన ఓ కాంగ్రెస్ నేత సిద్దమయ్యారు. ఇందుకోసం ఆయన తన ఇల్లు, దుకాణాలు అమ్మకానికి పెట్టారు. అంతేకాదు తనను చూసి ఆయన మిత్రులు కూడా వారి ఆస్తులను విక్రయించడానికి సిద్దపడ్డారని, తాము త్వరలోనే డబ్బును సమీకరించిన తరువాత తమ అధినేత కోసం వాటిని పంపుతామని సదరు కాంగ్రెస్‌ నేత ప్రకటన చేశారు. ఇంతకీ ఎవరాయన అంటే..

మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్‌ నేత అశోక్‌ జైస్వాల్‌. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గోనేందుకు వెళ్లిన రాహుల్.. తృటితో తాను ప్రయాణిస్తున్న విమాన ప్రమాదం నుంచి బయటపడ్డారని, విమాన సిబ్బంది ఆలస్యంగా స్పందించడం వల్ల విమానం ఒక్కసారిగా కొంత మేర కిందకు వచ్చిందని.. కేవలం 20 సెకన్ల వ్యవధిలో ప్రమాదం నుంచి బయటపడిందని వార్త తెలిసి తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని చెప్పారు. ఈ ఘటన విని తాను బాగా భయపడ్డానని కూడా చెప్పారు.

అప్పుడే రాహుల్ గాంధీ కోసం ఆధునికమైన అత్యంత భద్రతతో కూడిన విమానం కొనాలని అనుకున్నానని చెప్పారు. 2019 జాతీయ ఎన్నికల ప్రచారం కోసం ఆయన దానిని ఉపయోగించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. విమానం కొనేందుకు డబ్బు సేకరించాలని నిర్ణయించానని, తర్వాత ఇందుకోసం తన ఇల్లు, దుకాణాలు అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన స్నేహితులు కూడా స్వచ్ఛందంగా వారి ఆస్తులు అమ్మేందుకు సిద్ధపడ్డారని జైస్వాల్‌ వెల్లడించారు. పార్టీ నేతలంతా విమానం కొనేందుకు సహకరించాలని కోరారు. తాము సేకరించిన డబ్బును ఢిల్లీలోని 24 అక్బర్‌ రోడ్డులో పార్టీ కార్యాలయానికి పంపిస్తామని చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నందున రాహుల్‌ గాంధీ విస్తృతంగా పర్యటనలు చేయాల్సి ఉంటుందని, రాహుల్‌ లాంటి నిజాయితీపరుడైన నేతను తాము క్షేమంగా ఉంచుకోవాలని అనుకుంటున్నామని 40ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న జైస్వాల్‌ తెలిపారు. రాహుల్ గాంధీ కుటుంబం నిజాయితీపరుల కుటుంబమని, వారు దేశం కోసం గొప్ప త్యాగాలు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ దేశం కోసమే బతికారని, దేశం కోసమే చనిపోయారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  Ashok Jaiswal  charter plane  karnataka election  pilot  congress  politics  

Other Articles