Bridge collapses in Kolkata, many feared trapped కోల్ కత్తాలో కుప్పకూలిన పురాతన రైల్వే ఓవర్ బ్రిడ్జి

Kolkata bridge collapse five dead and 15 trapped

Bridge Collapse,bridge collapse in Kolkata,bridge collapse in alipur, bridge collapse in majherhat, bridge collapses,Kolkata,Kolkata bridge collapse,Majerhat bridge,Majerhat bridge collapse,Mamata Banerjee, Rescue Operationslive news, west bengal

A bridge has collapsed in Kolkata in India leaving five people killed and 15 trapped, according to local reports. Pictures show several cars crushed under the Majherhat bridge, which is reported to have been repaired last month "in three days".

ITEMVIDEOS: కోల్ కత్తాలో కుప్పకూలిన పురాతన రైల్వే ఓవర్ బ్రిడ్జి

Posted: 09/04/2018 05:48 PM IST
Kolkata bridge collapse five dead and 15 trapped

కోల్ కతాలో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం సాయంత్రం ఆలీపోర్‌ ప్రాంతంలో మజర్ హట్‌ వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. అప్పటి వరకు ఎన్నో దశాబ్దాలుగా సేవలు అందించిన వంతెన సక్రమంగానే వుందని దానిపై ప్రయాణాలు సాగిస్తున్న వారితో పాటు దాని కింద రోడ్డుపై వెళ్లున్న వాహనదారులు బ్రిడ్జి కుప్పకూలడంతో దాని చిక్కుకున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ పరిణామంలో కార్లు, బస్సులు కూడా వంతెన శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

డైమండ్‌ హార్బర్‌ రోడ్ లోని ఈ వంతెన సాయంత్రం 4.45 నిమిషాలకు కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఐదు గంటలకు సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే పలువురిని స్థానికులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాద దృశ్యాలను పరిశీలిస్తే.. ఎక్కువ మంది బాధితులు వంతెన శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఒక మృతదేహాన్ని వెలికి తీసినట్లు సమాచారం.

కాగా, ఈ వంతెన కింద చిక్కుకుని ఇప్పటి వరకు ఐదు మంది చనిపోయారని మరో 15 మంది క్షతగాత్రులయ్యారని సమాచారం. కాగా బెంగాల్ మంత్రి ఫిర్హద్ హకీమ్ మాట్లాడుతూ శిధిలాల కింద వున్న వారందరనీ రక్షించామని, కాగా, ఇప్పటి వరకు ఎవరూ మరణించలేదని చెప్పారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. కోల్ కతాలోని అత్యంత పురాతన వంతెనల్లో ఇది కూడా ఒకటి. గత కొద్ది రోజులుగా ఇక్కడ వర్షాలు పడుతుంటడంతో వంతెన కూలిపోయి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇదిలావుండగా, గత రెండేళ్ల క్రితం వివేకానంద ఫై ఓవర్ కుప్పకూలిన ఘటనలో 22 మంది మరణించగా, దాదాపు వంద మంది గాయాలపాలైన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bridge Collapse  alipur  majherhat  Kolkata  Mamata Banerjee  Rescue Operations  west bengal  

Other Articles