Tollywood Director Jaya passes away దర్శకురాలు జయకు ప్రముఖుల సంతాపం

Chantigaadu director b jaya passes away in hyderabad

tollywood,Telugu Cinema,passes away,Lovely,journalist,Director,Chantigadu,BA Raju,B Jaya, Entertainment News,Telugu Movies News,Tollywood News,

One of the few women filmmakers to make a mark in the Telugu industry, Jaya breathed her last at 9.20 pm on Thursday in a private hospital in Gachibowli.

దర్శకురాలు జయకు ప్రముఖుల సంతాపం

Posted: 08/31/2018 04:32 PM IST
Chantigaadu director b jaya passes away in hyderabad

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సినీపరిశ్రమ నటుడు హరికృష్ణ అంతక్రియలు తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ, రాజకీయ పరిశ్రమకు చెందిన ప్రముఖులు విషాదంలో వుండగానే మరో విషాదవార్త వినిపించింది. ప్రముఖ దర్శకురాలు బి.జయ (54) గుండెపోటుతో క్రితం రోజు రాత్రి 9:30 గంటల సమయంలో మృతి చెందారు. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయ 2003లో 'చంటిగాడు' సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించారు. అంతకుముందు సినీ జర్నలిస్టుగా పనిచేశారు.

అయితే, సినిమాలపై మక్కువతో ఆమె దర్శకత్వ రంగంవైపు అడుగుపెట్టారు. ప్రేమికులు, గుండమ్మగారి మనువడు, సవాల్‌, లవ్లీ, వైశాఖం వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. కామ్న జెఠ్మలానీ, శాన్వి, సుహాసిని వంటి కథానాయికలను పరిచయం చేసింది జయనే. ప్రముఖ సినీ పాత్రికేయుడు, పీఆర్వో బీఏ రాజు ఆమె భర్త. ఆంగ్ల సాహిత్యం, సైకాలజీలో ఎమ్మే చేసిన జయ తొలుత సినీ పాత్రికేయురాలిగా పనిచేశారు. ఆ తర్వాత మెగాఫోన్ చేపట్టి ఐదు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆమె తీసిన ఆఖరు చిత్రం ‘వైశాఖం’.

కాగా, అమెకు పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. హైదరాబాద్‌ శ్రీనగర్‌ కాలనీలోని జయ స్వగృహంలో ఆమె భౌతికకాయానికి మహేశ్‌బాబు దంపతులు, వెంకటేశ్‌, వంశీ పైడిపల్లి, సుకుమార్‌, ఆది, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, నందినిరెడ్డి, ఝాన్సీ, ఉత్తేజ్‌, గుణశేఖర్‌, నృత్యదర్శకుడు శేఖర్‌, మంచు మనోజ్‌ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. జయ కుటుంబసభ్యులను పరామర్శించారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : B Jaya  passes away  Lovely  journalist  Director  Chantigadu  BA Raju  tollywood  

Other Articles