Cabinet approves additional 2% hike in DA కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. కరువు భత్యం పెంపు..

Good news for central government employees da raised by 2 per cent

dearness allowance, central government employees, Dearness Relief, pensioners, Dearness Relief, 7th Pay Commission, Pension, employee benefits

The Cabinet approved additional 2 percent hike in Dearness Allowance (DA) and Dearness Relief (DR), a move that will benefit about 1.1 crore central government employees and pensioners, an official release said.

కేంద్ర ప్రభుత్వం తీపికబురు.. కరువు భత్యం పెంపు..

Posted: 08/29/2018 07:58 PM IST
Good news for central government employees da raised by 2 per cent

కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. కేంద్రప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న డీఏ, ఢీఆర్ పెంపుకు పచ్చజెండాను ఊపింది. ఎట్టకేలకు ఇవాళ సమావేశమైన కేంద్ర క్యాబినెట్ తమ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ), డియర్‌నెస్ అలవెన్స్ (డీఆర్) పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదనంగా రెండు శాతం డీఏ, డీఆర్ పెంచుతున్నట్టు ప్రకటించింది. 2018 జూలై 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుంది.
 
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగులకు అదనంగా 2 శాతం డీఏ, పెన్షనర్లకు డీఆర్ పెంచేందుకు ఆమోదం తెలిపిందని, ప్రస్తుత ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని ఇప్పడిస్తున్న 7 శాతం బేసిక్ పే/పెన్షన్‌కు మరో 2 శాతం అదనంగా పెంచేందుకు నిర్ణయం తీసుకుందని అధికారికంగా విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. ఏడవ వేతన కమిషన్ సిఫార్సుల ఆధారంగా అంగీకరించిన ఫార్ములా కింద ఈ పెంపు జరిగింది. కేంద్ర ప్రభుత్వం అదనంగా పెంచిన డీఏ, డీఆర్‌తో 48.41 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 62.03 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. ఇందువల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ6,112.20 కోట్ల అదనపు భారం పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : central cabinet  central government employees  dearness allowance  

Other Articles