Pakistani railway official leave letter goes viral online నెట్టింట్లో వైరల్: నవ్వులు పూయిస్తున్న లీవ్ లెటర్

Pakistani railway official leave letter goes viral online

pakistan, pakistan railway minister, pakistan railway officer leave application, pak officer two year leave application, pak railway officer leaver letter viral, funny news, odd news, hilarious news, viral news

According to the letter going viral, Mohammad Hanif Gul, chief commercial manager of Pakistan Railways wrote, "the attitude of new minister is extremely non-professional and ill-mannered." The viral letter has got mixed reaction online.

నెట్టింట్లో వైరల్: నవ్వులు పూయిస్తున్న లీవ్ లెటర్

Posted: 08/28/2018 02:25 PM IST
Pakistani railway official leave letter goes viral online

లీవ్ లెటర్ అంటే అందరికీ తెలిసిందే. స్కూల్ విద్యార్థి దశలో ప్రతీ ఒక్కరూ ఈ లెటర్ నే నేర్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే లెటర్ అనేది ఎలా రాయాలో తెలియకపోయినా.. తాము తరగతులకు వెళ్లని రోజులకు ఇది తప్పనిసరిగా రాసి టీచర్లకు ఇవ్వాల్సి వుంటుంది. అలాంటీ లీవ్ లెటర్ ను ఓ అధికారి రాస్తే.. అది కాస్తా వైరల్ అయితే ఎలా వుంటుంది. సరిగ్గా అదే జరిగింది. పాకిస్థాన్ రైల్వే అధికారి ఒకరు తన పై అధికారికి రాసిన లీవ్ లెటర్ సామాజిక మాద్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ నెట్ జనులను నవ్వుకునేలా చేస్తోంది. దీంతో ఆ అధికారి లేఖ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అతడి లెటర్ పై కామెంట్ల వర్షం కురుస్తుంది. జియో న్యూస్ కథనం ప్రకారం.. హనీఫ్ గుల్ పాకిస్థాన్ రైల్వేలో గ్రేడ్ 20 అధికారి. పనిపై నిబద్ధత, ప్రేమ కలిగిన గుల్‌కు ఇటీవల ఓ చిక్కొచ్చి పడింది. ఆగస్టు 20న రైల్వే మంత్రిగా షేక్ రషీద్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పనితీరు గుల్‌కు ఏమాత్రం నచ్చలేదు. వృత్తి పట్ల ఆయనకు ఏమాత్రం నిబద్ధత లేదని గుల్ ఆరోపణ. రైల్వే మంత్రిగా పనిచేయడానికి అవసరమైన అర్హతలు ఆయనకు ఏకోశానా లేవని గుల్ విమర్శించారు. మంత్రితో కలిసి తాను పనిచేయలేనని పేర్కొంటూ తనకు సెలవు మంజూరు చేయాలని కోరారు.

అయితే, సెలవు కోరడంలో వింతేమీ లేదు కానీ, తనకు ఏకంగా 730 రోజులు సెలవు కావాలని కోరడమే ఇక్కడ అసలు విషయం. అది కూడా పూర్తి వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని అందులో విన్నవించారు. రెండేళ్ల తర్వాత మంత్రి తీరు మారితే అప్పుడు విధుల్లో చేరే విషయాన్ని ఆలోచిస్తానని అందులో పేర్కొన్నారు. విషయం కాస్తా మీడియాకెక్కడంతో వైరల్ అయింది. ఆ లీవ్ లెటర్ సోషల్ మీడియాకు చేరడంతో చక్కర్లు కొడుతోంది. అతడి పనితీరుకు ఈ లేఖ నిదర్శనమని పేర్కొంటూ నెటిజన్లు గుల్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pakistan railway  officer  minister  leave letter  viral news  news viral  two years leave  funny news  

Other Articles