constable sexual assault on accused wife in police station ‘కాకీ’ కావరం.. ఠాణాలనే కీచక పర్వం..

Constable sexual assault on accused wife in police station

raparthi excise police station, constable, sexual assault, belt shop, badram, khammam, Telangana, crime

A constable from Telangana, khammam district raparthi excise police station, who boozes with his friends in the station and sexual assault on accused wife in a closed room of police station.

‘కానిస్టేబుల్’ కావరం.. ఠాణాలనే కీచక పర్వం..

Posted: 08/28/2018 11:22 AM IST
Constable sexual assault on accused wife in police station

పోలిస్ స్టేషన్ అది లా అండ్ అర్డర్ అయినా లేక ఎక్సైజ్ ఠాణా అయినా ప్రజలకు మెండైన గౌరవం వుంటుంది. ఒకరు ప్రజల శాంతిభద్రతలను కాపాడుతుంటే మరోకరు సమాజంలో మలినాలను ఎప్పటికప్పుడు తడిచేస్తారని వారి పట్ల కూడా మర్యాదగా వ్యవహరిస్తారు. అయతే మారుతున్న కాలంతో పాటు పోలీసులు కూడా ప్రజలతో సన్నిహితంగానే మెలుగుతున్నారు. కానీ కొందరు మాత్రం తాము ఇంకా నిజాం కాలం నాటి పోలీసులమన్న భావనలో వ్యవహరిస్తూ ప్రజలపై పెత్తనం చేసేందుకు.. లేక వారిపై చేయకూడని పనులకు పాల్పడి వార్తల్లో నిలుస్తూ సమాజాంలో తమ సొంత శాఖ పరువును తీస్తున్నారు.

పనియే పూజ్యనీయం అన్న నానుడి ప్రకారం పనిచేసే ప్రాంతం, కార్యాలయం దేవాలయంతో సమానమన్న విషయాన్ని గుర్తెరుగని ఓ కానిస్టేబుల్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌లోనే స్నేహితులతో కలసి మందేసి.. తన బిడ్డతో పాటు ఠాణాకు చేరుకున్న నిందితుడి భార్యపై అత్యాచారానికి యత్నించాడు. మహిళ గట్టిగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు పోలీస్ స్టేషన్‌కు రావడంతో కానిస్టేబుల్ ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఖమ్మం జిల్లా రాపర్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిందీ ఘటన.

అక్రమంగా బెల్ట్‌షాపు నిర్వహిస్తున్నాడంటూ భద్రం అనే వ్యక్తిని పోలీసులు స్టేషన్‌కు తీసుకొచ్చారు. తన భర్తను కొడతారేమోనన్న అనుమానంతో భద్రం భార్య తన కుమారుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆ సమయంలో స్నేహితులతో కలసి స్టేషన్‌లోనే మందేస్తున్న కానిస్టేబుల్ ఆమెను ఓ గదిలో పెట్టి తాళం వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకున్నారు. దీంతో కానిస్టేబుల్ వెనక్కి తగ్గాడు.

ఈ ఘటనపై బాధిత మహిళ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా బాధిత మహిళ భర్త భద్రం మాట్లాడుతూ తన భార్యను వదిలిపెట్టమని బతిమాలుకున్నా కానిస్టేబుల్ కనికరించలేదని పేర్కొన్నాడు. స్థానికులు రావడంతోనే కానిస్టేబుల్ వెనక్కి తగ్గాడని, లేదంటే ఘోరం జరిగేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : raparthi excise police station  constable  sexual assault  belt shop  badram  khammam  Telangana  crime  

Other Articles