I would have killed Gandhi, says pooja shakun pandey నేను గాంధీని చంపేదాన్ని: పూజా శకున్ పాండే

If not godse i would have killed gandhi says pooja shakun pandey

Akhil Bharat Hindu Mahasabha, Mahatma Gandhi, nathuram godse, January 30 1948, Pooja Shakun Pandey, Hindu Court, Sharia Court, Swami Chakrapani Maharaj, meerut, uttar Pradesh

Judge of the first self-styled Hindu court in Uttar Pradesh's Meerut, Pooja Shakun Pandey gave a controversial statement about the assassination of Mahatma Gandhi.

గాడ్సే చంపకపోయివుంటే నేను గాంధీని చంపేదాన్ని: పూజా శకున్ పాండే

Posted: 08/24/2018 11:03 AM IST
If not godse i would have killed gandhi says pooja shakun pandey

హిందూ భావజాల సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆమె ఇప్పటికే దేశ ప్రజలకు పరిచయం కాగా.. ఏకంగా యావత్ దేశాన్ని ఒక్కతాటిపై నడిపించి అంగ్లేయుల గుండెల్లో సింహస్వప్నంగా మారి.. శాంతి, అహింసా మార్గాలను ఆచరించి దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన జాతిపిత మహాత్మాగాంధీపై అమె విషం చిమ్ముతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

నాథూరామ్ గాడ్సేను తాను ఆరాధిస్తానని, అప్పట్లో మహాత్మాగాంధీని ఆయన చంపకుంటే తానే ఆ పనిచేసే దానినని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే.. అడ్డుకునే గాడ్సే మరొకరు ఉంటారని ఆమె పేర్కొన్నారు. గాడ్సేను తాను ఆరాధిస్తానని, ఆ విషయాన్ని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పుకొచ్చారు. నిజానికి గాంధీని గాడ్సే చంపలేదని తేల్చి చెప్పారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేలోపే అతడిని శిక్షించారని పూజ వివరించారు.

హిందూ కోర్టు పేరుతో అఖిల భారత హిందూ సభ (ఏబీహెచ్ఎం) ఇటీవల మీరట్‌లో సొంతంగా వివాదాస్పద న్యాయస్థానాన్ని ప్రారంభించింది. దానికి పూజ శకున్‌ పాండేను న్యాయమూర్తిగా నియమించింది. ఈ కోర్టులపై ఓపక్క అలహాబాద్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కాగా, పూజ గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాక్ పేరుతో భర్తల చేతిలో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూ ధర్మాన్ని అనుసరించాలని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదం అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahatma Gandhi  nathuram godse  Pooja Shakun Pandey  Hindu Court  meerut  uttar Pradesh  

Other Articles