CM Kumaraswamy targeted by misleading video కర్ణాటక సీఎం ఏరియల్ సర్వేలో వీడియోలలో నిజమెంతా.?

Misleading video of aerial survey used to target karnataka cm kumaraswamy

kumaraswamy, whatsapp video, viral video, aerial survey video, misleading videos, cm reading news paper in aerial survey, floods in kodugu, karnataka

Kumaraswamy’s second survey that lasted for more than an hour, there are many other clips of him surveying flood-affected areas during the journey. However, one video was selectively circulated to mislead people.

కర్ణాటక సీఎం ఏరియల్ సర్వేలో వీడియోలలో నిజమెంతా.?

Posted: 08/23/2018 12:55 PM IST
Misleading video of aerial survey used to target karnataka cm kumaraswamy

కేరళతో పాటు ఇటు కర్ణాటకలోని కొడుగు ప్రాంతంలో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించిందన్న వార్తలతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి ఏరియల్ సర్వే కూడా నిర్వహించారు. అయితే ఆయన నిర్వహించిన ఏరియల్ సర్వే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏరియల్ సర్వేపై సోషల్ మీడియాలో మొదటగా విడుదలైన వీడియో వైరల్ గా మారింది. అయితే ఇది కావాలని తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు తీసిన వీడియోనని, దీంతో తన పాలనను సాగనివ్వకుండా ప్రత్యర్థులు ఎంతలా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో అర్థం చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వర్గాలు అరోపిస్తున్నాయి.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కర్ణాటకలో ఓ వైపు భారీ వర్షాలు కుదిపేసి.. పంటలను నాశనం చేస్తూ.. అనేక మందిని నిరాశ్రయులను చేసిన నేపథ్యంలో ఏరియల్‌ సర్వేకి వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి.. హెలికాప్టర్ లో కూర్చోని సర్వే చేయకుండా..  ఎంచక్కా పేపర్‌ ఎలా చదువుకుంటున్నారో చూశారా?’’ అంటూ ఓ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఏరియల్‌ సర్వే నిర్వహించకుండా తనకేమీ పట్టదన్నట్లుగా పేపర్‌ చదువుకుంటున్న దృశ్యాలు అందులో ఉన్నాయి. ఇంతకీ ఈ వీడియోల్లో నిజమెంత?

కర్ణాటకలోనూ భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా కొడుగు జిల్లాపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కుమారస్వామి ఈ నెల 19న ఏరియల్‌ సర్వే నిర్వహించేందుకు వెళ్లారు. ఆ సందర్భంగా తీసిన వీడియోలే ఇవి. అందులో కుమార స్వామితో పాటు మరో ఇద్దరు కూడా వీడియోలో ఉన్నారు. ‘‘పేపర్‌ చదవడానికే అయితే హెలికాప్టర్‌ ఎక్కడమెందుకో’’ అంటూ కామెంట్లతో ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే అదునుగా భావించిన ఇతర పార్టీ నేతలు వాటిని రీట్వీట్‌ కూడా చేశారు.

మైసూరు నుంచి ఏరియల్‌ సర్వేకు హెలికాప్టర్‌ ఎక్కిన కొద్దిసేపటికే ముఖ్యమంత్రి పేపర్‌ చదువుతుండగా తీసినవే ఆ దృశ్యాలని మీడియా కార్యదర్శి వివరణ ఇచ్చారు. అంటే గమ్యస్థానానికి చేరకముందు తీసిన దృశ్యాలు అన్నమాట. ఆ తర్వాత కొడుగు జిల్లాకు చేరుకున్నాక ముఖ్యమంత్రి ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ఆ దృశ్యాలను ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ఉంచింది. అయినప్పటికీ కొందరు పనిగట్టుకుని ఈ అసత్య ప్రచారానికి తెర తీశారని జేడీఎస్‌ పార్టీ నేతలు విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kumaraswamy  whatsapp video  viral video  aerial survey video  floods in kodugu  karnataka  

Other Articles