Saudi Arabia beheads female activist ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ధీరనారికి శిరచ్ఛేదం

Saudi arabia beheads female activist in public report

Saudi Arabia, Female Activist, Death Penalty, Esra al-Ghamgam, democracy, king's rule, prosecutor, saudi arabia

Female Activist Esra al-Ghamgam, was executed on the prosecutor’s orders. It shared a video showing an executioner fixing her in a recumbent position on the ground before decapitating her with a sword as security forces stood by.

ప్రజాస్వామ్యం కోసం పోరాడుతున్న ధీరనారికి శిరచ్ఛేదం

Posted: 08/22/2018 12:41 PM IST
Saudi arabia beheads female activist in public report

అరబ్ దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియాలో రాజరిక పాలనకు వ్యతిరేకంగా.. గళం విప్పి.. ప్రజాస్వామ్య వాదంకోసం గళం విప్పిన ఓ ధీరనారి అమరురాలైంది. ప్రజాస్వామ్యమే ప్రజలకు శ్రీరామ రక్ష అని భావించి ఆ దిశగా శాంతియుతంగా ప్రచారం చేస్తూ.. పోరాటానికి నాంది పలికిన ఓ మహిళా హక్కుల కార్యకర్తకు.. అ దేశంలోని రాచరిక పాలన బహిరంగంగా మరణ దండన అమలు చేశారు. ఈ శిక్షలో భాగంగా ఆమెకు  శిరచ్ఛేదనం చేశారు. మహిళా కోర్టు న్యాయమూర్తి మరణ దండన విధించడంతో ఆ మహిళా కార్యకర్తకు ఈ తరహా శిక్షను అమలు చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. సౌదీలో మహిళా హక్కుల పోరాటం చేసే కార్యకర్తల్లో ఒకరు ఎస్రా అల్ ఘంఘం. ఈమెను గత 2015 డిసెంబరు 8వ తేదీన ఆ దేశ భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ఆమె భర్త కూడా పక్కనే ఉన్నారు. షియాల ప్రాబల్యం ఉన్న ఖతీఫ్ ప్రాంతంలో ప్రజాస్వామ్యానికి మద్దతుగా, రాజకీయ నిర్బంధంలో ఉన్నవారిని విడుదల చేయాలని శాంతియుతంగా నిరసనగా ప్రదర్శనలను ఎస్రా అల్-ఘంఘం నిర్వహించేది.

ఈ చర్యలను అరేబియా సర్కారు తోసిపుచ్చుతూ ఆమెపై రాజద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతోందన్న అభియోగం మోపారు. అమెను గత మూడేళ్ళుగా కారాగారంలో బంధించి అనేక అవస్థలకు గురిచేశారు. అటు రాజరికపు పాలనకు ఎదురోడ్డి అమెకు మద్దతుగా న్యాయవాదిని కూడా పెట్టుకోలేని స్థితిలోకి ఘంఘం కుటుంబ వెళ్లింది. దీనికి తోడు ఆర్థిక పరిస్థితులు కూడా లేకపోడంతో అమె తరపున వాదించడానికి న్యాయవాదులు ఎవరూ ముందుకురాలేకపోయారు. దీంతో ప్రభుత్వం ఏకపక్షంగా ఆమెకు బహిరంగ శిరచ్ఛేద మరణశిక్ష విధించింది.
 
శిక్ష అములులో భాగంగా తలారి ఆమె తలను నేలకు తాకేలా సరిగ్గా అమర్చి కత్తితో ఒక వేటుకి నరికేశాడు. నాలుగు రోడ్ల కూడలిలో భద్రతా బలగాల సమక్షంలో ప్రజలంతా చూస్తుండగా ఈ శిక్షను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా సౌదీ అరేబియాకు కొత్త రాజుగా ఎన్నికైన మొహమ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలు చేపడుతూ దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణానికి కృషి చేస్తున్నట్టు ప్రచారం చేసుకొంటున్న సమయంలో ఘంఘం శిరచ్ఛేదం జరగడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles