SC says no to NOTA in Rajya Sabha elections రాజ్యసభలో నోటాకు చెల్లుచీటి.. సుప్రీం కీలక తీర్పు..

Nota can t be permitted in rajya sabha polls says sc

rajya sabha elections, nota, nota in rajya sabha elections, no NOTA in Rajya Sabha polls, chief justice, dipak mishra, justice khanwilkar, justice chandrachud, election commission

The Supreme Court today said the option of none of the above (NOTA) cannot be ... notification allowing NOTA option in the ballot papers for Rajya Sabha polls.

రాజ్యసభలో నోటాకు చెల్లుచీటి.. సుప్రీం కీలక తీర్పు..

Posted: 08/21/2018 09:03 PM IST
Nota can t be permitted in rajya sabha polls says sc

పైన సూచించిన వ్యక్తులపై అయిష్టాన్ని వ్యక్తం చేస్తూ సాధారణ ఎన్నికలలో ఓటర్లు వినియోగించే నోటా ఆప్షన్ వినియోగంపై రాజ్యసభ ఎన్నికలలో కూడా వినియోగించాలన్న ఎన్నికల కమీషన్ అభిప్రాయానికి చీటీ చెల్లింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇవాళ కీలకమైన తీర్పునిచ్చింది. రాజ్యసభ ఎన్నికలకు నోటా వర్తించదని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

'రాజ్యసభ ఎన్నికలు అన్నవి పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికలకు నోటా వర్తించదు. ప్రత్యక్ష ఎన్నికలకు మాత్రమే నోటా వర్తిస్తుంది' అంటూ సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చకపోతే ఉపయోగించే ఈ నోటా (నన్ ఆఫ్ ద అబౌవ్) ఆప్షన్ ను ఎన్నికల సంఘం రాజ్యసభ ఎన్నికలకు అనుమతించడాన్ని ఆక్షేపించిన సుప్రీంకోర్టు, ఎలక్షన్ కమీషన్ (ఈసీ) జారీ చేసిన నోటిఫికేషన్ ను తిరస్కరించింది.
 
ఈ విషయంపై గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ విప్ శైలేష్‌ మనుభాయ్‌ పార్మర్‌ దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని జస్టిస్ కన్ విల్కర్, జస్టిస్ చంద్రచూడ్ లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రాజ్య సభ ఎన్నికల్లో నోటాను అనుమతిస్తే అవినీతిని ప్రోత్సహించడమే అవుతుందని పార్మర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేసిన సుప్రీం నోటాపై ఎలక్షన్ కమీషన్ నిర్ణయాన్నితోసిపుచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajya sabha elections  nota  rajya sabha elections  supreme court  election commission  

Other Articles