Low pressure to give heavy Monsoon rains in Telugu states తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ మరో వార్నింగ్..

Low pressure to give heavy monsoon rains in andhra pradesh telangana

rain in andhra pradesh, rain in telangana, rain in rayalaseema, monsoon in india, monsoon in andhra pradesh, monsoon in telangana, monsoon 2018, rain in hyderabad, hyderabad rains, weather in hyderabad, hyderabad weather, bay of bengal, low pressure, heavy rains, monsoon, Andhra pradesh, Telangana

Monsoon conditions are once again back over Andhra Pradesh and Telangana. All thanks to the well-marked low pressure area over Northwest Bay of Bengal and adjoining Odisha and West Bengal.

తెలుగు రాష్ట్రాలకు మరో వార్నింగ్.. మరో రెండు రోజులు..

Posted: 08/21/2018 11:34 AM IST
Low pressure to give heavy monsoon rains in andhra pradesh telangana

అటు కేరళ, ఇటు కర్ణాటక రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తూ అనేక మంది ప్రాణాలను బలిగొంటూ.. వేలాది మందిని నిరాశ్రయులను చేస్తున్న వరుణుడు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. కేరళలను కకావికలం చేసిన వరుణుడు ఇటు కర్ణాటకలోని కొడగు ప్రాంతంలో కూడా వరుణుడు ప్రళయం సృష్టిస్తున్నాడు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాలల్లో కూడా కరుస్తున్న ఏకధాటి వర్షాలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరదలతో అతలాకుతలం చేస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలలో కురుస్తున్న వర్షాలకు ఇప్పట్లో ఎడతెరిపి లేనట్లుగానే వుంది. వానలకు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తామని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర కోస్తా ఒడిశాలను ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.

దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే, పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bay of bengal  low pressure  heavy rains  monsoon  Andhra pradesh  Telangana  

Other Articles