SC issues summons to Yogi Adityanath యోగి అతిథ్యనాథ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

2007 gorakhpur riots sc issues summons to yogi adityanath

Yogi Adityanath, hate speech, Supreme Court, Chief Justice, Dipak Misra, Justice A.M. Khanwilkar, Justice D.Y. Chandrachud, Allahabad High Court, Yogi Adityanath hate speech, Gorakhpur riots, Muharram, Uttar pradesh

The Supreme Court asked the Uttar Pradesh government to explain in four weeks why Chief Minister Yogi Adityanath should not be prosecuted for an alleged hate speech he gave in Gorakhpur in 2007.

యోగి అతిథ్యనాథ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

Posted: 08/20/2018 07:39 PM IST
2007 gorakhpur riots sc issues summons to yogi adityanath

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఇవాళ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆదిత్యనాథ్ ను ఎందుకు విచారించొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్ ప్రదేశ్ అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. 2007 సంవత్సరంలో గోరఖ్ పూర్ లో యోగి ఆదిత్యనాథ్‌ చేసిన ప్రసంగం విద్వేష పూరితంగా ఉందంటూ దాఖలైన పిటీషన్ పై విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్థానంలో వున్న యోగీని ఎందుకు విచారించవద్దని నిలదీసింది.

యోగీ అదిత్యనాథ్ పై వచ్చిన వచ్చిన ఆరోపణలపై.. దాఖలైన అభియోగాలపై ఆయనను ఎందుకు విచారించొద్దో నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గోరఖ్ పూర్‌ అల్లర్ల కేసులో యోగి ఆదిత్యనాథ్‌ను విచారించొద్దని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ఎందుకు కట్టుబడాలని ప్రశ్నించింది.

గతంలో అలహాబాద్‌ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అయితే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఎందుకు యోగి ఆదిత్యనాథ్‌ను విచారించొద్దో వివరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌ ఎంపీగా ఉన్నప్పుడు 2007లో రైల్వేస్టేషన్‌ వెలుపల ఇచ్చిన ప్రసంగం ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని, ఆయన ప్రసంగం వల్లే ఘర్షణలు జరిగాయని కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yogi Adityanath  Supreme Court  Allahabad High Court  hate speech  Gorakhpur riots  

Other Articles