Fears of More Rain; Red Alert in 11 Districts కేరళపై పగబట్టిన వరుణుడు.. 11 జిల్లాలలో రెడ్ అలర్ట్

Fears of more rain red alert in 11 districts

Kerala Floods, Kerala Rain, IMD, depression, PC Chacko, PM Modi, Kerala floods 2018, Kerala landslides, Kerala flood, Kerala rains, Kerala rains, Kerala flood news, Floods in Kerala, Idukki dam, Kerala CM Pinarayi Vijayan, Governor P. Sathasivam, Union Tourism Minister KJ Alphons

Amid fears of more rain in the flood-hit state, the red alert has also been issued again in 11 of the 14 districts. Kerala has been reeling under murderous monsoon, which has claimed 324 lives

కేరళపై పగబట్టిన వరుణుడు.. 11 జిల్లాలలో రెడ్ అలర్ట్

Posted: 08/18/2018 03:12 PM IST
Fears of more rain red alert in 11 districts

కేరళ రాష్ట్రంపై పగబట్టిన వరుణుడు.. గత పది రోజులుగా ఏకధాటిగా కురుస్తూ తన ప్రతాపాన్ని చాటుతన్న విషయం తెలిసిందే. కేరళవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలదిగ్భంధనంలో చిక్కుకోగా.. దాదాపుగా 14 జిల్లాల్లో అత్యవసర పరిస్థితిని విధించింది అక్కడి రాష్ట్ర ప్రభుత్వం. ఓ వైపు వరదలు మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఎటుచూసినా మళయాలీయుల కన్నీటి సంధ్రంగా మారింది. నగరాలు, పట్టణాలు కూడా నదులై పారుతున్నాయి. అదివారం నుంచి కొంత ఉపశమనం లభిస్తున్న వార్తలో అశలు కడలితో తేలిన మళయాలీయులపై వరుణుడి ప్రకోపం కొనసాగుతుంది.

తాజాగా వాతావరణ కేంద్రం జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో కేరళలో ఇవాళ ఉదయం అత్యవసర అప్రమత్త పరిస్థితిని ఉపసంహరించుకున్న 14 జిల్లాలలో.. మళ్లీ 11 జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాలు సుమారుగా 7 నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు చేసుకోనుందని వార్తలతో కేరళ సర్కార్ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజుల పాటు 11 జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తాయన్న వార్తతో మళయాళీయులు కలవరం చెందుతున్నారు.

దీంతో వర్షా ప్రభావిత జిల్లాలోకి యుద్దప్రాతిపదికన సహాయ చర్యలు అందించేందుకు మరికొంత కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని కాంగ్రెస్ నేత పీసీ చాకో అన్నారు. గత పది రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో వేలాది మంది ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారని అన్నారు. కేరళ రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి తీవ్రంగా ఉంది. అత్యవసరంగా బాధితులను తరలించేందుకు మరిన్ని చర్యలు అవసరం. చేసినంతవరకూ అభినందనీయమే అయినా కేరళతో పాటు వరద బాధిత రాష్ట్రాలకు కేంద్రం మరింత సాయం అందించాలి అని చాకో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala Floods  IMD  depression  PC Chacko  PM Modi  Pinarayi Vijayan  Governor  Sathasivam  

Other Articles