Daughter Performs Last Rites of Former PM కూతురి చేత కమలదళ బీష్ముడి అంత్యక్రియలు..

Full military honours for former pm daughter performs last rites

Atal Bihari Vajpayee, Ram Nath Kovind, PM Modi, smriti sthal, LK Advani, last rites, Namitha Bharadwaj Amit Shah, krishna menon marg, last journey, Congress, Jawaharlal Nehru, Lal Bahadur Shastri, Mahatma Gandhi, atal bihari vajayee funeral, Atal Bihari Vajpayee, BJP, Mohan Bhagwat, Narendra Modi, Vajpayee, vajpayee death

Last rites of former Prime Minister Atal Bihari Vajpayee are performed by his adopted daughter Namitha Bharadwaj at the Smrithi Sthal near Rajghat

కమలదళ బీష్ముడికి కూతురి చేత అంత్యక్రియలు..

Posted: 08/17/2018 04:59 PM IST
Full military honours for former pm daughter performs last rites

మాజీ ప్రధాని, కమలదళ బీష్ముడు భారత రత్న అటల్‌ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిసాయి. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అశ్రు నయనాల మధ్య ఆయన అంత్యక్రియలు హిందూ బ్రాహ్మణ సంప్రదాయుక్తంగా నిర్వహించారు. అజాత శత్రువు, అజన్మ బ్రహ్మచారిగా వున్న అటల్ బిహారీ వాజ్ పేయి అంత్యక్రియలను ఆయన దత్తపుత్రిక నమిత నిర్వహించారు. విజయ్ ఘాట్ వద్ద యమునా నది తీరాన రాష్ట్రీయ స్మృతిస్థల్ లో ఆయన అంతిమ సంస్కారాలను నిర్వహించారు.

ప్రభుత్వ లాంఛనాలతో భారత సైనిక దళాలు 21 సార్లు గాలిలో తుపాకులు పేల్చి గౌరవ వందనం సమర్పించిన క్రమంలోనే మంచి గంధపు చెక్కల చితిపై అటల్ బిహారీ వాజ్ పేయి పార్ధివ దేహానికి ఉంచిన తరుణంలో దత్త పుత్రిక నమిత భట్టాచార్య నిప్పంటించారు. కాగా, హిందూ సంప్రదాయం ప్రకారం వేద పండితులు వాజ్ పేయి అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపి కేంద్ర కార్యాలయం నుంచి కొనసాగిన వాజ్ పేయి అంతిమ యాత్ర రాష్ట్రీయ స్మృతి స్థల్ వద్దకు చేరుకున్న తరువాత భారత ప్రభుత్వం తరపున రాష్ట్రపతి, ప్రధాని, విదేశాంగ, రక్షణ శాఖా మంత్రులు ఆయనకు తుది వీడ్కోలు పలికారు.

రాష్ట్రీయ స్మృతి స్థల్ లో వాజ్ పేయి భౌతిక కాయానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా తుది నివాళులర్పించారు. వాజ్ పేయి శవపేటిక వద్ద పుష్పగుచ్ఛం ఉంచి మన్మోహన్ నివాళులర్పించారు. అంతకుముందు, బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ, అమిత్ షా, భూటాన్ రాజు వాంగ్ చుక్, నేపాల్ మంత్రి తదితరులు తుది నివాళులర్పించారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, సుష్మాస్వరాజ్, విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, బీజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఆయన కుటుంబసభ్యులు వాజ్ పేయికి కన్నీటీ వీడ్కోలు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles