political-leaders queue-for-atal-bihari-vajpayee-s-final-look ‘‘మహానేత’’ కడసారి చూపు కోసం క్యూ కట్టిన ప్రముఖులు

Political leaders celebrities in queue for atal bihari vajpayee s final look

Amit Shah, atal bihari vajayee funeral, Atal Bihari Vajpayee, BJP, krishna menon marg, Mohan Bhagwat, Narendra Modi, Vajpayee, vajpayee death

Amid chants of 'Atal Bihari Amar Rahe', a decorated gun carriage carrying the mortal remains of former PM Atal Bihari Vajpayee is nearing the new BJP headquarters at Deen Dayal Upadhyay Marg.

‘‘మహానేత’’ కడసారి చూపు కోసం క్యూ కట్టిన ప్రముఖులు

Posted: 08/17/2018 11:02 AM IST
Political leaders celebrities in queue for atal bihari vajpayee s final look

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భౌతిక కాయానికి తుది వీడ్కోలు పలికి.. నివాళులు అర్పించేందుకు దేశంలోని అన్ని పార్టీల రాజకీయ నేతలు క్యూ కడుతున్నారు. అటల్ జీ తో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటున్నారు. బీజేపి సహా బీజేపియేతర, ఎన్డీయేతర పార్టీల నేతలు కూడా వాజ్ పాయ్ బౌతిక ఖాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్‌పేయికి ఆ పార్టీ నేతలు నివాళి అర్పించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, అంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వాజ్ పేయి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.

అటల్ జీ పరమపదించిన ఆనంతరం నిన్న ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని ఇంటికి తరలించడంతో ఆయన నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దీంతో క్రితం రోజు సాయంత్రం నుంచి వాజ్ పేయి నివాసాని పెద్ద సంఖ్యలో ప్రజలు, బీజేపి నేతలు, వివిధ పార్టీల రాజకీయ నేతలు ఆయనకు అంజలి ఘటించారు. కాగా కొద్దిసేపటి క్రితం అటల్ జీ బౌతిక ఖాయాన్ని బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడ మధ్యాహ్నం ఒకటిన్నరకు వాజ్ పేయి తమ పార్టీ నేతల కోసం ఉంచనున్నారు.

ఇప్పటికే పలువురు పార్టీల అధినేతలు హస్తినలో ఉన్నారు. అటల్ జీని ఆఖరి సారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్రపతి కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు నియాగాంధీ, పలువురు కేంద్ర మంత్రులు మహానేతకు నివాళి అర్పించారు. ఆయన నివాసానికి చేరుకున్న ప్రముఖులు తుదిచూపు కోసం బారులు తీరారు. బీజేపి పాలిత రాష్ట్రాల్లో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించడంతో పాటు జాతీయ జెండాను అవతనం చేయాలన్న అదేశాలను కూడా పార్టీ పంపింది.

ఇక మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు వాజ్ పేయి అంతిమయాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్ లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో వివిధ పార్టీల రాజకీయ నేతలు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు, బీజేపి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు పాల్గోననున్నారు. కాగా యమునా తీరంలో ఆయనకు స్మృతివనం నిర్మించనున్నారు. గతంలో యమునా నది ఒడ్డున ఎలాంటి స్మారక నిర్మాణాలు చేపట్టకూడదన్న ఆదేశాలను రద్దు చేశారు. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : atal bihari vajayee  funeral  BJP  krishna menon marg  Mohan Bhagwat  Narendra Modi  Amit Shah  

Other Articles