Assam's Boka Chaul gets GI tag వండకుండా వడ్డించే బియ్యం.. జిఐ ట్యాగ్ పొందిన అస్సోం వరి వంగడం..

Assam s magic rice variety that needs no cooking gets gi tag

Boka saul (oryza sativa), paddy variety, geographical indication (GI) tag, lower Assam, Government of India, Intellectual Property India, xaali season, Nalbari, Barpeta, Goalpara, Kamrup, Darrang, Dhubri, Chirang, Bongaiagoan, Kokrajhar, Baksa, Lotus Progressive Centre, Lotus Progressive Centre, assam boka saul, assam rice gi status, gi assam muga, indigenous rice variety in assam

Boka saul (oryza sativa), a paddy variety grown in parts of lower Assam, has got the geographical indication (GI) tag, bestowed upon it by the Government of India’ Intellectual Property India (IPI) body.

వండకుండా వడ్డించే బియ్యం.. జిఐ ట్యాగ్ పొందిన అస్సోం వరి వంగడం..

Posted: 08/10/2018 05:26 PM IST
Assam s magic rice variety that needs no cooking gets gi tag

సాధారణంగా అన్నం వేడివేడిగా తినాలనుకునే వారు వండివార్చిన తరువాత కానీ తినలేరు. మూడు దశాబ్దాల క్రితం కట్టెల పోయిలపై వండివార్చితే.. అందుకు సుమారు 45 నిమిషాల సమయం పట్టేంది. కాగా ప్రస్తుతం అటు స్టౌ పై వండితే 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. ఇక తాజాగా అందులోకి వచ్చిన రైస్ కుక్కర్లలో వండివార్చాలంటే సగానికి సగం సమయం తగ్గిపోతుంది. అయితే అసోంలో పండించే ఓ రకం బియ్యాన్ని వండకుండానే తినేయ్యొచ్చు. అయితే అలా తినడానికి ముందు మాత్రం ఓ గంట సమయం తప్పక బియ్యం నానబెట్టాలన్న కండీషన్ వుంది.

ఏంటీ.. ఎలాంటి గ్యాస్‌ స్టౌ‌, రైస్‌ కుక్కర్‌ అవసరం లేకుండా బియ్యాన్ని నానబెట్టడంతోనే ఉడికినట్టుగా తయారై తినడానికి సిద్దంగా మారిపోతుందా.? అంటే ఔననే అంటున్నారు అస్సోం వాసులు. అస్సోంలోని దిగువ అస్సోంలో బొకా సాల్ గా పిలిచే వరి వంగడం ఈ బియ్యం ప్రత్యేకత ఇది. అందుకే ఈ బియ్యానికి భౌగోళిక గుర్తింపు(జీఐ)ను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మరీ ముఖ్యంగా అసోంలోని నల్బరీ, బార్పెటా, గోల్‌పరా, కామ్‌రూప్‌, ధుబ్రీ, చిరాంగ్‌, బస్కా, దరంగ్‌ తదితర ప్రాంతాల్లో ఈ బొకా ఛాల్‌ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు.

మొఘలుల కాలంలో ఈ బియ్యాన్ని ఎక్కువగా సైన్యం కోసం పండించేవారు. తర్వాతి కాలంలో రైతులు తినడం మొదలుపెట్టారు. జూన్‌-డిసెంబరు మధ్య ఈ బియ్యాన్ని అసోం రైతులు పండిస్తారు. దీన్ని వండేందుకు ఎలాంటి గ్యాస్‌, పొయ్యి అవసరం లేదు. కేవలం గంటపాటు చల్లటి నీటిలో నానబెడితే సరిపోతుంది. నీటిలో నానడం వల్ల బియ్యం ఉబ్బి మెత్తగా మారుతుంది. ఆ తర్వాత ఇందులో పెరుగు, బెల్లం, అరటిపండు ఇలా కావాల్సిన పదార్థాలను కలుపుకుని నేరుగా తినేయ్యొచ్చు. అసోంలోని కొన్ని ప్రాంతాల్లో పండగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంటికి వచ్చిన అతిథులకు ఈ బియ్యాన్ని వండిపెడతారు.

అయితే ప్రస్తుత కాలంలో ఈ బియ్యాన్ని రైతులు కేవలం తమ కోసం మాత్రమే పండించుకుంటున్నారు. బయట వ్యక్తులకు ఇది అంతగా తెలియకపోవడంతో మార్కెట్‌ పరంగా లాభదాయకంగా ఉండదని రైతులు భావిస్తున్నారు. ఈ బియ్యం గురించి తెలుసుకున్న రెండు స్వచ్ఛంద సంస్థలు లోటస్‌ ప్రొగ్రెసివ్‌ సెంటర్‌(ఎల్‌పీసీ), సెంటర్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎడ్యుకేషన్(సీఈఈ) దీనిపై పరిశోధనలు చేశాయి. ఈ బియ్యం గురించి అందరికీ తెలియజేసి మార్కెట్‌ను పెంచాలనే ఉద్దేశ్యంతో 2016లో ఈ సంస్థలు బొకా ఛాల్‌కు భౌగోళిక గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఈ దరఖాస్తులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవల బొకా ఛాల్‌కు జీఐ గుర్తింపు ఇచ్చింది.

ఈ బొకా ఛాల్‌ ఆరోగ్యానికి ఎంతోమంచిదని ఇటీవల గువాహటి యూనివర్శిటీ చేసిన అధ్యయనంలోనూ తేలింది. ఇందులో 10.73శాతం ఫైబర్‌, 6.8శాతం ప్రొటీన్లు ఉన్నాయని సదరు అధ్యయనం పేర్కొంది. ఈ బియ్యం మనిషి శరీరంలోని వేడిని తగ్గింస్తోందట. అంతేగాక.. ఈ బియ్యాన్ని రసాయనాలతో కూడిన క్రిమిసంహారక మందులతో పండించడం సాధ్యం కాదట. ఒకవేళ అలాంటివి వాడితే పంట మొత్తం నాశనమవుతుందని తమ పరిశీలనలో తేలిందని ఎన్జీవోలు చెబుతున్నాయి. కేవలం బయో ఎరువులు మాత్రమే వినియోగించి రైతులు ఈ బియ్యాన్ని పండిస్తారు. అత్యవసర సమయంలో ఈ బియ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎల్పీసీ, సీఈఈ ఎన్జీవోలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల అసోం రైతులకు లాభదాయకం గానూ ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles