School Students Forced to Repair Roads టీచర్లా.. కాంట్రాక్టర్లా.? విద్యార్థులతో రోడ్డు పనులా.?

School students forced to repair roads say refusal leads to thrashing

haryana, Mahendragarh, School boys, teachers, students, repairing roads, damaged road, government school, contractors, education officer, rajbala, crime

A group of school boys all dressed in school uniforms, were seen repairing a damaged road near a government school in Haryana's Mahendragarh and were beaten up if refused to do so.

టీచర్లా.. కరుడుగట్టిన కాంట్రాక్టర్లా.? విద్యార్థులతో రోడ్డు పనులా.?

Posted: 08/08/2018 03:28 PM IST
School students forced to repair roads say refusal leads to thrashing

విద్యార్థులకు పాఠాలతో పాటు విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు.. వారిని రోడ్డు రిపేరు పనుల నిమిత్తం పంపుతూ.. పార్ట్ టైం టీచర్లుగా, ఫుల్ టైం కాంట్రాక్టర్లుగా మారిపోయారు. అదేంటి అంటే కాంట్రాక్టర్లు తమ వద్ద పనిచేసే మనుషులకు డబ్బులు చెల్లిస్తూ కూడా వారితో అయ్యా, బాబు అంటూ పనులు చేయించుకుంటారు. కానీ ఇక్కడి ఉపాధ్యాయులు మాత్రం విద్యార్థులచే రోడ్డు రిపేరు పనులను ఉచితంగా చేయించుకుంటూ అందుకు నిరాకరించిన విద్యార్థులను చావబాదుతున్నారు. దీంతో ఎదురుతిరిగే ధైర్యం లేక.. టీచర్లు చెప్పింది చేసేస్తున్నారు విద్యార్థులు.

టీచర్స్ డే రోజున లేక నవంబర్ 15న బాలల దినోత్సవం రోజుకు ముందురోజున స్కూలుకు వెళ్లే పిల్లలు తమ గదులను శుభ్రం చేస్తుంటారు. ఇంకా అవసరమైన పక్షంలో అవసరమైతే పాఠశాల ఆవరణను కూడా శుభ్రం చేసి.. అందంగా అలంకరిస్తారు. తమ పాఠశాలలో పచ్చధనం-పరిశుభ్రతా వుండాలని ఉద్దేశ్యంతో మొక్కలు కూడా నాటుతుంటారు. టీచర్లు, విద్యార్థులు కలసి సరదా వాతావరణంలో ఇలాంటి పనులు చేస్తుంటారు. కానీ హరియాణాలో మాత్రం సీన్ రివర్స్ అయింది.

ఇక్కడి మహేంద్రగఢ్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద రోడ్డు బాగా దెబ్బతింది. దీంతో స్కూల్ కొచ్చిన విద్యార్థులకు టీచర్లు చదువు చెప్పకుండా రోడ్డు రిపేర్ చేయాలని ఆదేశించారు. దీంతో పిల్లలు యూనిఫాంలోనే మట్టి, కంకర తీసుకొచ్చి రోడ్డు గుంతలను పూడ్చుతున్నారు. ఈ విషయమై విద్యార్థుల్ని మీడియా ప్రశ్నించగా.. రోడ్డు రిపేరు చేయకుంటే టీచర్లు తమను చావబాదుతున్నారని పిల్లలు వాపోయారు. దీంతో ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారి రాజ్ బాలా దృష్టికి కొందరు తీసుకెళ్లారు. కాగా, ఈ ఘటనపై విచారణకు ఆదేశించామనీ, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజ్ బాలా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles