media tycoon mootha to join jana sena జనసేన ప్రకటన.. పార్టీలోకి మీడియా దిగ్గజం, మాజీ మంత్రి..

Former minister mootha to join pawan kalyan s jana sena

Pawan Kalyan, Janasena party, Mootha Gopalakrishna, Media tycoon, @Republic news, India Ahead, Shashidhar, Gautam, kurnool, Thota Chandrasekhar, Nimmagadda Prasad, quarry victim families, explosion victims, hospitalised victims, andhra pradesh, politics

Mootha Gopalakrishna former MLA and Minister of United Andhra Pradesh to join Jana Sena Party, JSP officially released a statement on joining of Media tycoon and his sons. Besides owning Andhra Prabha, they are also all set to launch a (@Republic news) Telugu and an English (India Ahead) news channels.

జనసేన ప్రకటన.. పార్టీలోకి మీడియా దిగ్గజం, మాజీ మంత్రి..

Posted: 08/06/2018 02:10 PM IST
Former minister mootha to join pawan kalyan s jana sena

జనసేన అధినేత పవన్ కళ్యాణ్  వైపు తన రాజకీయ వ్యూహాలను పదనుపెడుతూనే.. మరోవైపు తన పర్యటనలను కూడా కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆయన కర్నూలు జిల్లాకు బయలుదేరి వెళ్లారు. కర్నూలు జిల్లా  హత్తిబెళగల్‌లో సంభవించిన క్వారీలో ప్రమాదం ప్రాంతానికి బయలుదేరి వెళ్లారు. ఘటన ప్రదేశాన్ని సందర్శించి తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్న వారిని, మృతుల బంధువులను పవన్ పరామర్శిస్తారు. పవన్‌ కల్యాణ్‌ కర్నూలు పర్యటన నేపధ్యంలో జనసేన కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు.

గత నాలుగు మాసాలుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజా సమస్యలను అవగతం చేసుకుంటున్నా పవన్.. అటు పార్టీ విస్తరణ దిశగా వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే ఓ వైపు అధికార విపక్ష పార్టీలను షేక్ చేస్తూ చాపకింద ప్రచారం జోరందుకున్న జేఎస్పీలో చేరుతామంటూ పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులతో పాటు ఏకంగా మాజీ స్పీకర్ నాదేండ్ల కూడా పవన్ తో రహస్య మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అయితే పార్టీలోకి వలసలను అప్పుడు అహ్వానం పలకడంపై అచితూచి వ్యవహరిస్తున్న పవన్ కల్యాన్.. ఎలాంటి విమర్శలు లేని వ్యక్తులను మాత్రం సాదరంగా పార్టీలోకి అహ్వానిస్తున్నారు.

ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి, మీడియా దిగ్గజమైన ముత్తా గోపాలకృష్ణ ఆయన తనయులు శశిధర్, గౌతమ్ లను మాత్రం జనసేనలో చేరనున్నట్లు పార్టీ అధికారకంగా వెల్లడించింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసిన పార్టీ.. జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కల్యాణ్ ముత్తా తన తనయులతో వచ్చి భేటీ అయ్యారని.. పవన్ వారిని సాదరంగా పార్టీలోకి అహ్వానించారని, అయితే అధికారిక ప్రకటన మాత్రమేనని, వారు లాంఛనంగా త్వరలోనే పార్టీలో చేరుతారని ప్రకటనలో తెలిపారు.

ముత్తా గోపాలకృష్ణ రాజకీయ నాయకుడే కాకుండా పారిశ్రామిక వేత్త కూడా. ఆంధ్రప్రభ పత్రికను గత కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్న ముత్తా గోపాలకృష్ణకు ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోనూ ఆయనకు వాటాలున్నాయి. అంతేకాకుండా దాదాపుగా మరో రెండు మూడు మాసాల్లో లాంఛింగ్ కు ఇండియా ఎహెడ్ అనే ఆంగ్ల ఛానెల్ తో పాటుగా రిపబ్లిక్ న్యూస్ అనే తెలుగు ఛానెల్ కూడా ప్రారంభానికి సిద్దంగా వున్నాయని, అవి గౌతమ్, శశిధర్ లు పర్యవేక్షణలో నిర్వహంచబడనున్నాయని తెలుస్తుంది. ఇక ముత్తా గౌతమ్ ఆధ్వర్యంలో ఇండియా ఎహెడ్ అనే ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ లో పవన్ కళ్యాణ్‌ హోస్ట్‌గా ఓ కార్యక్రమం చేయనున్నారు. ఇది అమీర్ ఖాన్ సత్యమేవ జయతే తరహాలో ఉండనుంది. ఈ ప్రోగ్రాం ద్వారా జనసేన పార్టీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని పార్టీ భావిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles