50 friends seek revenge of Aurangzeb's death ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న ఔరంగజేబు స్నేహితులు..

50 youths from aurangzeb s village return home to avenge their friend s death

Aurangzeb, Rashtriya Rifles, Indian Army, Jammu And Kashmir, terrorists, Friends, Avenge on militants, gulf countries, avenge friends death, Pulwama district, South Kashmir

Many Indians have left their job in Gulf countries to join the Indian army to avenge death of rifleman Aurangzeb, who was a part of 44, Rashtriya Rifles, was abducted from Pulwama district of South Kashmir and was killed by militants on June 14.

ప్రతీకారేచ్చతో రగిలిపోతున్న ఔరంగజేబు స్నేహితులు..

Posted: 08/03/2018 11:58 AM IST
50 youths from aurangzeb s village return home to avenge their friend s death

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం అంటూ పాటలను అలపించిన వారంతా దేశీయ అర్మీలో రాష్ట్రీయ రైఫిల్స్ విభాగంలో జవానుగా పనిచేసి.. ఉగ్రవాదుల చేతుల్లో బలైన ఔరంగజేబు స్నేహితులు. కాలక్రమేనా గల్స్ దేశాల్లో పెద్దపెద్ద జీతాలను అర్జిస్తూ అక్కడే ఉపాధిని పోందుతున్నారు. అయితే కశ్మీర్ లో రంజాన్ సందర్భంగా ఇంటికి వెళుతున్న ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ ను ఉగ్రవాదులు జూన్ 14న అపహరించి.. అత్యంత కిరాతకంగా హత్య చేసిన నేపథ్యంలో.. అతని స్నేహితులందరూ తమ ఉద్యోగాలను వదిలిపెట్టి.. కాశ్మీర్ చేరుకున్నారు. తమ స్నేహితుడి హత్యకు ప్రతీకారేచ్చతో రగిలిపోతున్నారు.

అవసరమైన నేపథ్యంలో తామంతా అర్మీ, లేక ఇతరాత్ర భద్రతా దళాల్లో చేరి.. తమ స్నేహితుడి అత్మకు శాంతిని చేకూర్చుతామని ప్రతీనబూనారు. పూంచ్ జిల్లాలోని మెంధర్ మండలం సలాని గ్రామానికి చెందిన ఆర్మీ అధికారి ఔరంగజేబ్ ను జూన్ లో కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు దారుణంగా హత్యచేశారు. ఈ విషయం తెలుసుకున్న సౌదీ అరేబియాలోని గ్రామ యువకులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. తమ సోదరుడ్ని చంపినవాళ్లను మట్టుబెట్టేందుకు ఉద్యోగాలకు రాజీనామా చేసిన 50 మంది యువకులు.. అప్పటికప్పుడు స్వగ్రామానికి బయలుదేరారు.

ఈ విషయమై మొహమ్మద్ కిరామత్ అనే యువకుడు మాట్లాడుతూ.. ‘ఔరంగజేబ్ ను ఉగ్రవాదులు చంపారని తెలియగానే నా ఉద్యోగానికి రాజీనామా చేసి, వెంటనే స్వస్థలానికి బయలుదేరా. నాలాగే దాదాపు 50 మంది యువకులు భారీ జీతభత్యాలను వదులుకుని సలానీకి తిరిగివచ్చారు. మా అందరి లక్ష్యం ఔరంగజేబ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడమే’ అని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల్ని వేటాడేందుకు తామంతా ఆర్మీ, పోలీస్ విభాగంలో చేరుతామని ప్రకటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles