Gavaskar, Kapil, Sidhu, Amir Invited For Imran's Oath Ceremony ‘‘పాక్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్లడానికి నేను రెడీ..’’

Navjot sidhu accepts imran khan s invite for oath says great honour

Imran Khan, Navjot Sidhu, Imran Khan swearing-in, Imran Khan Modi embarassment, Aamir Khan, Sunil Gavaskar, Kapil Dev, Fawad Chaudhry, Pakistan Tehreek-e-Insaf

Punjab Cabinet Minister Navjot Singh Sidhu said that he has accepted the invitation extended by Imran Khan for attending his swearing-in ceremony as the Prime Minister of Pakistan.

‘‘పాక్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి వెళ్లడానికి నేను రెడీ..’’

Posted: 08/02/2018 02:45 PM IST
Navjot sidhu accepts imran khan s invite for oath says great honour

పాకిస్థాన్ నూతన ప్రధానమంత్రిగా ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేయనున్న పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ తనను అహ్వానించడం గ్రేట్ హానర్ అని.. ఈ ప్రమాణ స్వీకారానికి తాను ఖచ్చితంగా హాజరుకానున్నానని పంజాజ్ క్యాబినెట్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి భారత్ నుంచి టీమిండియా మాజీ క్రికెటర్లు గవాస్కర్, కపిల్ దేవ్, నవజోత్‌సింగ్ సిద్ధు, బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌లను ఆహ్వానాలు అందాయని సమాచారం.

అయితే తనకు అందిన అహ్వానంపై ఎవరు ఇంకా వెల్లడించకముందే.. సిద్దూ మాత్రం తాను ఈ ఆహ్వానానికి కచ్చితంగా వెళ్తానని అన్నారు. ఇమ్రాన్ నుంచి తనకు ఆహ్వానం అందిందన్న విషయాన్ని వెల్లడించిన ఆయన, ఇది తనకు లభించిన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఇమ్రాన్ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను తప్పకుండా వెళతానని చెప్పారు. ఖాన్ మంచి వ్యక్తని, నమ్మదగిన వాడని కొనియాడారు. రెండు దేశాల మధ్య క్రీడాకారులు వారధిలా నిలుస్తారని అభిప్రాయపడ్డ ఆయన, ఇమ్రాన్ రాకతో భారత్- పాక్ ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు.

భారత దేశానికి చెందిన ప్రముఖులను ప్రమాణస్వీకారాణికి అహ్వానించిన ఇమ్రాన్ ఖాన్.. అలాగే, సార్క్ దేశాల ప్రముఖులను కూడా ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పీటీఐ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కెప్టెన్‌గా 1992లో పాకిస్థాన్‌కు క్రికెట్ ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన సారథ్యంలోని పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, 116 సీట్లను మాత్రమే గెలుచుకుని అధికారానికి అవసరమైన మరో 22 సీట్ల దూరంలో ఆగిపోయింది. దీంతో చిన్నా, చితకా పార్టీలను కలుపుకుని కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఇమ్రాన్ సిద్ధమయ్యారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles