sandalwood villian accused of blackmailing actress అసభ్యవీడియోతో నటి నుంచి రూ.14 లక్షలు లాగిన విలన్..

Actor absconding after actress accuses him of blackmail extortion

dharma, dharma blackmail, dharma blackmail case, dharama case, dharma blackmailing, dharma actor, dharmendra, Sangeetha Vishwanath, blackmailing, extorting money, sandalwood, crime

A sandalwood actor has filed a complaint against noted Kannada actor Dharmendra, popularly known as Dharma, accusing him of extorting money from her and threatening to leak obscene videos of her.

అసభ్యవీడియోతో నటి నుంచి రూ.14 లక్షలు లాగిన విలన్..

Posted: 08/01/2018 12:01 PM IST
Actor absconding after actress accuses him of blackmail extortion

సినిమాల్లో విలన్ వేషాలు వేసే వారు చాలా మంది బయట మాత్రం చాలా సున్నిత మనస్కులై వుంటారు. ఇంకా చెప్పాలంటే వారి ఔదార్యం, దానదాతృత్వాల్లో హీరోలను కూడా మించిపోతారు. కానీ దురదృష్టవశాత్తు విలన్ క్యారెక్టర్ లో నటించే వారు తము నిజజీవితంలో కూడా విలన్ వేశాలు వేయడం.. తమ సహచర నటిలనే టార్గెట్ గా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. నటి అసభ్యకర వీడియోను చిత్రీకరించి, ఆపై దానిని చూపించి బ్లాక్ మెయిల్ చేసి రూ.14 లక్షలు వసూలు చేసిన ఘటనలో శాండిల్ వుడ్ నటుడు ధర్మేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.

నటి సునీత పిర్యాదు మేరకు స్పందించిన బెంగళూరు పోలీసులకు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం దర్మ మాత్రం పరారీలో వున్నాడని పోలీసులు తెలిపారు. గత ఏడాది మార్చి నుంచి ధర్మేంద్ర తన నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నట్టు నటి సంగీత విశ్వనాథ్ ఆరోపించింది. అతడి డిమాండ్లను నెరవేర్చకుంటే తన భర్త, పిల్లలను చంపేస్తానని బెదిరించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసుల కథనం ప్రకారం.. జూన్ 6న ఉదయం పది గంటల సమయంలో సునీత బెంగళూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ధర్మపై బలవంతపు వసూళ్లు, బెదిరింపుల కేసు పెట్టింది.మార్చి 1, 2017న  రాత్రి సునీతకు ఫోన్ చేసిన ధర్మ షూటింగ్ కోసం వెంటనే బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్‌కు వెళ్లాలని సూచించాడు. అందుకోసం తన డ్రైవర్ నవీన్‌కు కారు ఇచ్చి సునీత ఇంటికి పంపాడు. అతడు ఆమెను తీసుకెళ్లి షూటింగ్ సెట్ వద్ద వదిలిపెట్టాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న ధర్మ షూటింగ్ రద్దు అయినట్టు చెప్పి భోజనానికి పిలిచాడు. భోజనం చేసి కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.

మెలకువ వచ్చి చూసిన తర్వాత ఆమెకు అసభ్యకర వీడియో చూపించిన ధర్మ బ్లాక్ మెయిల్ చేశాడు. తాను అడిగిన మొత్తాన్నిఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. ఆన్‌లైన్‌లో దానిని అప్‌లోడ్ చేస్తానని, ఆమె తల్లిదండ్రులకు దానిని చూపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడిపోయిన సునీత మార్చి 2017 నుంచి మే 2018 వరకు మొత్తం రూ.14 లక్షలు చెల్లించుకుంది. ఈ ఏడాది మే 27న ధర్మతో సునీత, ఆమె భర్త వాదనకు దిగారు. తమ నుంచి తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ రాత్రి సునీత ఇంటికి వచ్చిన ధర్మ మరిన్ని డబ్బులు ఇవ్వకుంటే అందరినీ చంపేస్తానని బెదిరించాడని సునీత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ధర్మతోపాటు నవీన్ అనే మరో వ్యక్తిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dharmendra  blackmailing  Sangeetha Vishwanath  extorting money  sandalwood  crime  

Other Articles