air travel made easy after 2 months విమానయానం ఇక మేడ్ ఈజీ.. డిజీయాత్రతో..

Air travel made easy with digi yatra facility after 2 months

digi yatra, suresh prabhu, supreme court, hassle-free, hassle-free flying, speedy flying, mumbai aviation, aadhaar number, air ticket booking, airport entry, suresh prabhu, latest news, mumbai

The civil aviation ministry’s proposed “digi yatra” facility, which seeks to make flying speedy and hassle-free, is expected to be rolled out in the next two months,

విమానయానం ఇక మేడ్ ఈజీ.. డిజీయాత్రతో..

Posted: 07/30/2018 03:34 PM IST
Air travel made easy with digi yatra facility after 2 months

కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ‘డిజి యాత్ర’ సౌకర్యం రాకతో ఇక విమానయాన ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగంగా తమ ప్రయాణాలను చేసుకునే వీలు కల్పించనుంది. ఈ డిజి యాత్ర సదుపాయం మరో రెండు నెలల్లో అమలులోకి రానుండటంతో.. ఇక కేవలం రెండు మాసాలు ఒపిక పడితే.. ఆ తరువాత ప్రయాణికులు వేగిర ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేశ్ ప్రభు ఇవాళ ఈ విషయం వెల్లడించారు.

‘డిజి యాత్ర’ సౌకర్యం వల్ల విమానయానంలో కాగితం వినియోగాన్ని తగ్గించ‌డంతో పాటు అవాంతరాలు లేని వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. డిజిటల్ వ్య‌వ‌స్థ‌ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించడానికి, విమానం ఎక్కడానికి సదరు ప్రయాణికుల ఆధార్ నంబర్ ను, మొబైల్ నంబర్ ను వినియోగిస్తారు. ఈ వ్యవస్థ కింద డిజిటల్ రూపంలోనే టికెట్ బుకింగ్, విమానాశ్రయం ఎంట్రీ, బోర్డింగ్ పాస్, సెక్యూరిటి చెకింగ్ ను నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ భావిస్తోంది.

తమ ప్రభుత్వం రానున్న రోజుల్లో డిజి యాత్ర పేరిట స‌రికొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకు వస్తున్నాం. రానున్న రెండు నెలల్లోనే దీనిని ప్రారంభిస్తామనే విశ్వాసంతో ఉన్నాం’ అని ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు పేర్కొన్నారు. ఈ ‘డిజి యాత్ర’ వ్యవస్థ కింద ప్రయాణికులు విమానాశ్రయంలోకి అడుగుపెట్టిన తరువాత వారి ఫేసియల్ లేదా ఐరిష్ బయోమెట్రిక్‌ను తీసుకుంటారు. ఆ తరువాత సదరు ప్రయాణికులు జీవితంలో మ‌రెప్పుడైనా సెక్యూరిటి చెకింగ్ లేకుండానే విమానయానం చేయవచ్చు’ అని మంత్రి వివరించారు. అయితే, ప్రజల గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను ప్రభుత్వం అనుసరిస్తుందని, ‘డిజి యాత్ర’ అమలు సందర్భంగా వాటిని ఉల్లంఘించబోదని మంత్రి వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles