Hyderabad Student Goes Missing In USA అమెరికాలో అదృశ్యమైన హైదరాబాదీ యువకుడు..

26 yr old hyderabad man missing in us family seeks sushma swaraj s help

hyderabad man missing, mirza ahmed ali bai, indian man missing in us, hyderabad man missing in us, External Affairs Minister, Indian embassy in US, sushma swaraj, indian embassy, Hyderabad, United States, crime

A 26-year-old Mirza Ahmed Ali Baig, from Hyderabad is missing since Friday in the United States. The family is now seeking help from External Affairs Minister Sushma Swaraj and the Indian Embassy in the United States.

అమెరికాలో అదృశ్యమైన హైదరాబాదీ యువకుడు..

Posted: 07/25/2018 04:46 PM IST
26 yr old hyderabad man missing in us family seeks sushma swaraj s help

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లిన ఓ హైదరాబాదీ యువకుడు అగ్రరాజ్యంలో అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తమ స్నేహితుడు అదృశ్యమైన ఘటనతో తీవ్ర ఆందోళనకు లోనైన అతని స్నేహితులు అక్కడి పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో పాటు ఇటు యువకుడి తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. నగరంలోని సంతోష్ నగర్ కు చెందిన మిర్జా అహ్మద్ అలీ బేగ్ (26) మాస్టర్స్ చదివేందుకు 2015లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్ లో ఓ మొబైల్ షాపులో పార్ట్ టైమ్ పనిచేసుకుంటూ బేగ్ చదువును కొనసాగిస్తున్నారు.

ఈ నెల 20న తల్లితో ఫోన్ లో మాట్లాడిన బేగ్.. తనకు భయంగా ఉందని చెప్పాడు. అయితే తనను ఎవరైనా బెదిరిస్తున్నారా? అన్న విషయమై ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంటికొచ్చిన సోదరుడు షుజాత్ బేగ్ ఫోన్ కు 2-3 సార్లు కాల్ చేయగా, ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు. మరోసారి కాల్ చేయగా, ఫోన్ స్విచ్ఛాఫ్ అని వచ్చింది. అప్పట్నుంచి బేగ్ ఆచూకీ తెలియరాలేదు. దీంతో  ఆందోళన చెందిన షుజాత్ వెంటనే బేగ్ పనిచేస్తున్నమొబైల్ షాపుకు కాల్ చేయగా, అతను ఎవ్వరికీ చెప్పకుండా అర్థంతరంగా షాపు నుంచి బయటకు వెళ్లిపోయాడని యజమాని జవాబిచ్చాడు.

బేగ్ షాపు నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీలోనూ రికార్డయ్యాయి. తన సోదరుడ్నిఎవరో బెదిరిస్తున్నారని షుజాత్ ఆరోపించారు. మరోవైపు బేగ్ అదృశ్యం కావడంపై అతని స్నేహితుడొకరు న్యూజెర్సీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బేగ్ గదిని పరిశీలించగా.. పాస్ పోర్ట్ సహా ఎలాంటి డాక్యుమెంట్లు లభ్యం కాలేదు. కాగా, తన కుమారుడి ఆచూకీని కనిబెట్టాలని బేగ్ తండ్రి ఇస్మాయిల్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కు లేఖ రాశారు. బేగ్ జాడ కనిబెట్టేందుకు సాయం చేయాలని ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ అమెరికాలోని భారత దౌత్య కార్యాలయానికి లేఖ రాశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mirza Ahmed Ali Baig  sushma swaraj  indian embassy  Hyderabad  United States  crime  

Other Articles