"Mob Killings Will End If Cow Killing Is Stopped": RSS Leader మూకదాడులపై ఆరెస్సెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Lynchings will stop if people don t eat beef says rss leader indresh

RSS, Mob lynching, lynching, Indresh Kumar, Cows, Gorakshak sanghs, Alwar, Rajasthan, PM Modi, PM appeal, RSS leaders, crime

RSS leader Indresh Kumar said that if cow-killing is stopped then lynchings will also automatically end, while lynching incidents must be condemned, it must be noted that many religions don't condone the killing of cows and they consider it a sin.

అప్పటి వరకు మూకదాడులు.. ఆరెస్సెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Posted: 07/24/2018 03:52 PM IST
Lynchings will stop if people don t eat beef says rss leader indresh

దేశవ్యాప్తంగా గోసంరక్షణ సమితి పేరుతో అవుల్ని తరలిస్తున్నారన్న వార్తలపై కొందరు అమాయకులను టార్గెట్ చేసి చంపుతున్న తీరుపై నిరసనలు పెల్లుబిక్కుతున్న నేపథ్యంలో.. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ నేత ఇంద్రేష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ప్రధాన మంత్రి గతంలో కొరినా.. బీజేపి కన్నా అరెస్సెస్ పెద్దది, పెద్దన్న అన్న భావనలో ప్రధాని మోదీ వినతిని కూడా లక్ష్యపెట్టని ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దేశంలో ఆవుల్ని చంపడం ఆపేస్తే మూకదాడులు వాటంతట అవే ఆగిపోతాయని ఇంద్రేష్ కుమార్ అన్నారు. ఏ మతం కూడా ఆవుల్ని చంపడాన్ని అనుమతి ఇవ్వబోదని ఆయన స్పష్టం చేశారు.

జార్ఖండ్ లోని రాంచీలో హిందూ జాగరణ్ మంచ్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా, రాజస్తాన్ లోని ఆళ్వార్ లో అక్బర్ అనే ముస్లిం యువకుడ్ని కొందరు దుండగులు కొట్టిచంపడంపై ఆయన స్పందిస్తూ.. ’గోవుల్ని చంపమని చెప్పే ఒక్క మతాన్ని నాకు చూపించండి. ఏసుక్రీస్తు పశువుల పాకలో పుట్టిన కారణంగా క్రైస్తవులు సైతం ఆవును గోమాతగా కీర్తిస్తారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన మక్కా, మదీనాల్లో గోవుల్ని చంపటాన్ని పాపంగా పరిగణించి నిషేధించారు. ఈ పాపం నుంచి ఈ ప్రపంచాన్ని, మానవకోటిని విముక్తం చేయడానికి మనం కంకణబద్ధులం కాలేమా? అని ఆయన ప్రశ్నించారు.

గోహత్యలు ఆగిపోతే మూకదాడులు వాటంతట అవే తగ్గిపోతాయి‘ అని పేర్కొన్నారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ పై ఇటీవల జార్ఖండ్ లో కొందరు వ్యక్తులు దాడి చేయడాన్ని కుమార్ ఖండించారు. "ఇది చాలా తప్పు, ఖండించతగినది. అయితే, భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి, ఇతరుల మనోభావాలను దెబ్బతీసే హక్కు మాత్రం ఎవ్వరికీ లేదు" అంటూ చురక అంటించారు. మూక దాడులు, అల్లర్లను నివారించేందుకు ప్రభుత్వం చట్టాలు చేసినప్పటికీ, వీటిని అరికట్టేందుకు ప్రజల్లో మంచి సంస్కారం, విలువల్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RSS  Mob lynching  lynching  Indresh Kumar  Cows  Gorakshak sanghs  Alwar  Rajasthan  crime  

Other Articles