break to nagarjuna akkineni kalyan jewellers ad నాగార్జున నిజాయితీ యాడ్ కు బ్రేకేసిన కల్యాణ్ జ్యువెలర్స్

Break to nagarjuna akkineni kalyan jewellers advertisement

Akkineni Nagarjuna, kalyan jewellers, advertisement, bank pension double time, pension ad, bank employee unions, sincerty, break to nag pension ad, i Nagarjuna, kalyan jewellers, advertisement, bank, pension

Amid protest from bank employee unions, kalyan jewellers had put an break to nagarjuna akkineni advertisement which was doubting their sincerty.

నాగార్జున నిజాయితీ యాడ్ కు బ్రేకేసిన కల్యాణ్ జ్యువెలర్స్

Posted: 07/23/2018 12:21 PM IST
Break to nagarjuna akkineni kalyan jewellers advertisement

తమ వ్యాపార ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలు ఎలా వున్నా.. వాటి విశ్వసనీయత, నాణ్యత, తదితర అంశాలపై మాత్రం కంపెనీలు నూటికి నూరుపాళ్లు కస్టమర్లకు నమ్మకం కుదిరేలా ప్రచారసాధనాల్లో ముమ్మర ప్రచారానికి తెరలేపుతాన్న విషయం అందరికీ తెలిసిందే. ఇలా కంపెనీలు ఎప్పటికప్పుడు తమ కస్టమర్లను కొత్త కోత్త యాడ్లలతో అకట్టుకుని వారిని అకర్షించి.. తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, అరు కాయలుగా కొనసాగేలా చర్యలు తీసుకుంటాయన్న విషయంలోనూ సందేహమే లేదు. ఇలాంటి ఓ చక్కనైన యాడ్ తో వచ్చి తమ దుకాణంలో నమ్మకమైన ఆభరణాలు అందిస్తామని చెప్పిన కల్యాణ్ జ్యూవెలర్స్ యాడ్ కు బ్రేకులు పడ్డాయి.

అక్కినేని నాగార్జున ఓ రిటైర్డు ఉద్యోగి వేషంలో.. తన మనవరాలితో పాటు బ్యాంకుకు వచ్చి.. తన నిజాయితీని రుజువు చేసుకునే యాడ్ ఇటీవల ప్రసార మాధ్యమాల్లోకి ప్రసారం కావడం..కలకలం రేపింది. ఎందుకని ఈ యాడ్ కలకలం రేపిందనేగా మీ డౌట్. ఈ యాడ్ లో బ్యాంకు అధికారులు కస్టమర్లను పట్టించుకునే విధానంతో పాటు.. అనుకోకుండా ఒకరి ఖాతాలోకి రెండు పర్యాయాలు వచ్చిన పెన్షన్ డబ్బును కట్ చేయడానికి చూసిన నిర్లక్ష్యం ధోరణి కనబడుతుంది. దీంతో కల్యాణ్ జువెల్లర్స్ యాడ్ పై బ్యాంకింగ్ అధికారులు కన్నెర చేశారు. అటు బ్యాంకు ఉద్యోగ కార్మిక సంఘాలు కూడా ఈ యాడ్ పై తీవ్రంగా ఫైర్ అవుతున్నాయి.

దీంతో ఈ యాడ్ ను వెంటనే నిలిపివేయాలని బ్యాంకింగ్ రంగ ఉద్యోగ, అధికార సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. తెలుగులో నాగార్జున, హిందీలో అమితాబ్ బచ్చన్, ఆయన కుమార్తె శ్వేతా బచ్చన్ లతో రూపొందించిన ఈ వ్యాపార ప్రకటన బ్యాంకులపై నమ్మకం కోల్పోయేలా ఉందంటూ ఏఐబీవోసీ (ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్) అసంతృప్తిని వ్యక్తం చేయడంతో, అన్ని మాధ్యమాల నుంచి యాడ్ ను తీసేస్తున్నట్టు కల్యాణ్ జువెల్లర్స్ ప్రకటించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  ఏఐబీవోసీ, హెచ్చరించిన నేపథ్యంలో, కల్యాణ్ జువెల్లర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

కాగా, ఈ యాడ్ ను కేవలం ప్రచారం కోసం మాత్రమే రూపొందించామని కల్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణరామన్ ఓ పత్రికా ప్రకటనలో పేర్కోన్నారు. అయితే తమ యాడ్ ఎవరి మనోభావాలను దెబ్బతీసేందుకు కాదని, తమ యాడ్ వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు తెలిపారని ఆయన అన్నారు. దీంతో ఈ యాడ్ ను ఇకపై ఏ విధమైన ప్రసారమాధ్యమాల్లోనూ వేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీనిని పూర్తిగా తొలగిస్తున్నామన్నారు. తమ సంస్థ వ్యాపారంలో బ్యాంకింగ్ వ్యవస్థది కీలక పాత్రని, దేశంలోని బ్యాంకులకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఎదురైనందుకు చింతిస్తూన్నామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి బ్యాంకులకు నష్టం కలిగించే చర్యలను తామెన్నడూ ప్రోత్సహించబోమని రమేశ్ కల్యాణరామన్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  kalyan jewellers  advertisement  bank  pension  pension ad  bank employee unions  

Other Articles