Lok Sabha passes bill to amend RTE Act విద్యార్థులూ.. జాగ్రత్తా.! మళ్లీ ఫెయిల్ విధానం అమల్లోకి..

Lok sabha passes bill to scrap no detention policy in schools

Lok Sabha, Monsoon session, Monsoon Session of Parliament, parliament, Right to Education, Right to Education Act, parliament, Right to Education, Amendment, no detention policy, prakash javadekar, RTE Act

A bill to amend the Right to Education (RTE) Act to abolish the 'no detention policy' in schools was passed in the Lok Sabha

విద్యార్థులూ.. జాగ్రత్తా.! మళ్లీ ఫెయిల్ విధానం అమల్లోకి..

Posted: 07/19/2018 01:34 PM IST
Lok sabha passes bill to scrap no detention policy in schools

భారత దేశంలో అన్ని రంగాల్లో తమ ఉనికి వుండేలా చర్యలు తీసుకుంటున్న కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని ప్రభుత్వం.. స్వాతంత్ర్యం ఏర్పడిన నాటి నుంచి కొనసాగుతున్న కరెన్సీ నోట్లను కూడా మార్చి.. ఇక కరెన్సీ వాడిన ప్రతిదేశపౌరుడికి ఈ నోట్లు ఎవరు ముద్రించారంటే నరేంద్రమోడీ అని పేరు చెప్పుకునేలా చేసి తరతరాలుగా మారని కరెన్సీ నోట్ల తలరాతలను కూడా ఒక్క పెట్టున మార్చేసింది. ఇక కాంగ్రెస్ తీసుకువచ్చిన మధ్యహ్న బోజన పథకాన్ని కదిపితే పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయని భావించిన కేంద్రం.. విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురావాలని భావించింది

తాజాగా విద్యాహక్కు చట్టానికి పలు సవరణలు చేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే విద్యాహక్కు చట్ట సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. దీంతో యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన ‘నో డిటెన్షన్’ విధానం రద్దు కానుంది. డిటెన్షన్ విధానంతో స్కూలుకు వచ్చే విద్యార్థులు డ్రాపవుట్ అవుతున్న నేపథ్యంలో 15ఏళ్ల బాలబాలికలు అందరికీ నిర్బంధ విద్యను అందజేయాలని.. అప్పటి ప్రభుత్వం ఈ విధానాన్ని అమలుపర్చింది. అయితే, తాజాగా విద్యాహక్కు చట్టానికి చేసిన సవరణలు మాత్రం ఇకపై నో డిటెన్షన్ విధానాన్ని లేకుండా చేస్తుంది.

కాగా ఈ విధానాన్ని రద్దు చేయాలా? కొనసాగించాలా? అనేది ఆయా రాష్ట్రాల విచక్షణపై ఆధారపడి ఉంటుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి మెరుగుపడిందని.. తెలంగాణ, సిక్కిం, కేరళ వంటి రాష్ట్రాల్లో ప్రైవేలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఇక ఈ విధానం ఇంకా అమల్లో వుంటే ప్రభుత్వం పాఠశాలలు కేవలం మధ్యహ్న బోజన కేంద్రాలుగా మారుతాయని, విద్యాలయాల్లో విద్యభాస్యం కానరాదని కేంద్రమంత్రి అందోళన వ్యక్తం చేశారు.

ఇక ఇప్పటివరకు విద్యాహక్కు చట్టం కింద 8వ తరగతి వరకు విద్యార్థులను డిటైన్ చేయడానికి వీల్లేదు. ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా వారిని పైతరగతికి పంపించేలా ప్రభుత్వ పాఠశాల యాజమాన్యాలు చర్యలు తీసుకునేవి. అయితే, విద్యాహక్కు చట్టంలో తాజా సవరణతో ఇప్పుడా అవకాశం ఉండదు. డిటెన్షన్ విధానం తిరిగి అమల్లోకి రానుండడంతో విద్యార్థులు పాసైతేనే పై తరగతికి వెళ్తారు. అయితే, 5, 8 తరగతుల విద్యార్థులకు మాత్రం రీ ఎగ్జామ్ విధానంతో మరో అవకాశం అందించనుంది ప్రభుత్వం. ఈ మేరకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానంతో అంగీకరించాయని కూడా మంత్రి వెలువరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles