Bombay HC saves parents from abusive sons హైకోర్టు తీర్పు తల్లిదండ్రులకు శ్రీరామరక్ష..

If ill treated parents can take back property gifted to son hc

Elderly parents, ill treated, gift deed, Maintenance Tribunal, Senior Citizens Act, Justice Ranjit More, Justice Anuja Prabhudesai, Bombay High Court, Mutual Fund returns, bank fixed deposits, stocks, shares, investor returns, portfolio allocation

Elderly parents, if ill treated, can take back property gifted to their son, says the Bombay High Court. Upholding an order passed by the Maintenance Tribunal, the Bench of Justice Ranjit More and Justice Anuja Prabhudesai said the gift deed can be cancelled.

హైకోర్టు తీర్పు తల్లిదండ్రులకు శ్రీరామరక్ష..

Posted: 07/17/2018 04:37 PM IST
If ill treated parents can take back property gifted to son hc

హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు తల్లిదండ్రులకు శ్రీరామ రక్షగా మారింది. వారు తమ సంతానానికి ఇచ్చే వారసత్వ సంపదను రద్దు చేసుకునే వెసలుబాటును న్యాయస్థానం కల్పించింది. వృద్ద తల్లిదండ్రులకు వారు అడిగిందల్లా ఇవ్వాల్సిన బాధ్యత సంతానంపైనే వుంటుందని, కేవలం అస్తులు తీసుకుని వారి అరోగ్య, పరిరక్షణ బాధ్యతలను పట్టదని వ్యవహరించే సంతానం నుంచి వారిచ్చిన అస్తిని వెనక్కు తీసుకునే వెసలుబాటు సీనియర్ సిటిజెన్స్ చట్టంలో వుందని ముంబై హైకోర్టు తీర్పును వెలువరించింది.

తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అస్తులను అందుకుని వారిని యోగక్షేమాలను పట్టించుకోని సంతానాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న తరుణంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అనేక వృద్దాశ్రమాలు, సీనియర్ సిటిజన్ల నుంచి హర్షం వ్యక్తమవుతుంది. ఏవో ప్రలోభాలకు గురిచేసి తమ పేరునున్న అస్తులను రాయించుకుని.. ఆ తరువాత వారిని పట్టించుకోని సంతానానికి ఇది ఒక హెచ్చరికలా నిలుస్తుంది.  వారిని మాటలతో, చేతలతో హింసించే వారికి కోర్టు తీర్పుతో షాక్ తగిలింది.

పిల్లలకు ఇచ్చిన ఆస్తిలో కొంత బాగాన్ని తిరిగి తీసుకుని హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని… జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ అనుజా ప్రభుదేశాయ్ ల నేతృత్వంలోని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. ముంబైలోని అంధేరికి చెందిన ఓ వృద్ధుడు తన ఫ్లాట్‌లో 50 శాతం భాగాన్ని కుమారుడికి గిఫ్ట్ డీడ్ పేరుతో రాసిచ్చిన అగ్రిమెంట్ పేపర్ ను ట్రిబ్యునల్ రద్దుచేయడాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ సందర్భంగా అమ్మానాన్నలు, వయోవృద్ధుల సంక్షేమకోసం తీసుకువచ్చిన.. తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్స్ నిర్వహణ, సంక్షేమ చట్టం-2007ను ధర్మాసనం ప్రస్తావించింది.

ప్రస్తుతం తాము ఉంటున్న ఫ్లాట్‌ను గిఫ్ట్ డీడ్ కింద తన పేరుతో బదలాయిస్తే తండ్రితోపాటు, అతడి రెండో భార్య బాగోగుల్ని చూసుకుంటానని కుమారుడు, కోడలు చెప్పారు. కానీ, ఆ తండ్రి 50 శాతం వాటాను మాత్రమే కుమారుడికి బదలాయించాడు. దీంతో సవతి తల్లిని సాకుగా చూపుతూ వారిద్దరి బాగోగుల్ని కుమారుడు, కోడలు నిర్లక్ష్యంచేశారు. ఈ అగ్రిమెంట్‌ను ట్రిబ్యునల్ రద్దుచేయడంలో మాకు ఎలాంటి తప్పు కనిపించడం లేదు అని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles