ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమని మహాకవి రాయప్రోలు సుబ్బారావు చెప్పిన మాటలను ాచరించకుంా.. అమెరికాకు వెళ్లి అక్కడ టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారం చేయించిన ఘనదంపతులు మోదుగుమూడి కిషన్.. చంద్ర తెలుగువారి పరువును తీశారు. ఈ షికాగో సెక్స్ రాకెట్ కేసులో అమెరికా న్యాయస్థానం నిందితులైన మోదుగుమూడి దంపతులను దోషులుగా తేల్చింది. చిత్తు కాయితంతో వెలుగుచూసిన ఈ కేసులో త్వరగానే విచారణ పూర్తైంది.
ఇప్పటికే నిందితులైన మొదుగుమూడి దంపతులకు సంబంధించిన ఈ కేసులోని అధారాలన్నింటినీ సేకరించిన పోలీసులు వాటిని కూడా న్యాయస్థానంలో సమర్పించారు. దీంతో న్యాయస్థానం వారిని దోషులుగా నిర్ధారించింది. ఈ నెల 18న వీరికి శిక్ష ఖరారు చేయనుంది. వీరికి పదేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికా రప్పించి.. అక్కడ వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు నిజమేనని అమెరికా న్యాయస్థానం తేల్చింది. అనైతిక కార్యక్రమాల కోసం విదేశీ మహిళలను అక్రమంగా రవాణా చేసినట్టు తేల్చింది. వీసా పర్మిట్లను దురిన్వియోగం చేశారన్న ఫెడరల్ ఏజెన్సీ ఆరోపణలతో నార్త్ ఎలినాయ్ కోర్టు ఏకీభవించింది.
తెలుగు సినిమాలకు కో ప్రొడ్యూసర్‌గా పని చేసిన కిషన్.. తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యాడు. తనకున్న పరిచయాలతో నటీమణులను సెక్స్ రాకెట్లోకి లాగాడు. కొన్ని ఏళ్లపాటు తన భార్యతో కలిసి ఈ దందాను నడిపాడు. అమెరికాలోని తెలుగు సంఘాలకు ఈవెంట్ల కోసం సెలబ్రిటీలను సప్లయ్ చేసే కోఆర్డినేటర్ ముసుగులో నటీమణులను వ్యభిచార ఊబిలోకి లాగారు. కిషన్ మోదుగుమూడి విటులతో మాట్లాడుతున్న ఆడియో టేపులు ఆ మధ్య బయటకు వచ్చాయి.
శ్రీరాజు చెన్నుపాటి, విభ జయం పేరిట కిషన్ ఆయన భార్య చీకటి దందాను నడిపారు. కిషన్ దంపతుల వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరపగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నటీమణులు అమెరికా చేరుకోగానే వారి పాస్‌పోర్టులను లాగేసుకునే వారని, బలవంతంగా వారితో వ్యభిచారం చేయించేవారని తెలిసింది. ఒప్పుకోకపోతే రిటర్న్ టికెట్లు బుక్ చేయమని, పాస్‌పోర్టులు ఇవ్వమని బెదిరించే వారనే వార్తలు వెలువడ్డాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more