union ministers touring andhra pradesh delivering good news నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్రమంత్రుల రాక.. తీపి కబుర్లు.. వరాలు..

Union ministers touring andhra pradesh delivering good news

nitin gadkari, new port, dredging corporation of india, Shipping Minister, Visakhapatnam port, Paradeep port, New Mangalore Port, AIIMS, Mangalgiri, Andhra Pradesh, politics

Ahead of state government anti central government propaganda on special status to the state in the election bound andhra pradesh, union ministers nitin gadkari and jp nadda touring the state delivering good news.

నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్రమంత్రుల రాక.. తీపి కబుర్లు.. వరాలు..

Posted: 07/13/2018 03:18 PM IST
Union ministers touring andhra pradesh delivering good news

ప్రత్యేక హోదా కల్పించకుండా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపి అధిష్టానం ఎత్తుకు పైఎత్తు వేస్తుంది. రాష్ట్రంలో కేంద్రమంత్రుల పర్యటనలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలో పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు,, నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీలు ఇస్తూ వరాల జల్లు కురిపిస్తున్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నానికి చేరుకున్న కేంద్ర షిప్పింగ్ మంత్రి నితిన్ గడ్కారీ ఈ మేరకు రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు.

విశాఖపట్నం పోర్టు విస్తరణకు ఎటువంటి భూమీ అదనంగా లభించే అవకాశం లేదని నితిన్ గడ్కరీ అన్నారు. తాము ఓడరేవు పోర్టుని అభివృద్ధి చేస్తామని, పోర్టులు ఉన్న చోట క్రూజ్‌ టెర్మినళ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఓడరేవు పోర్టుకు 3 వేల ఎకరాలు కావాలని సీఎంకు లేఖ రాస్తానని అన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశమైన డ్రెడ్జింగ్ కార్పోరేషన్ అఫ్ ఇండియాను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేసే ప్రశ్నే లేదని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

సదరు సంస్థకు సంబంధించిన స్టేక్ లు విశాఖపట్నం, పారదీప్, మంగళూరు పోర్టులు తీసుకుంటాయని ఆయన వెల్లడించారు. ఇక దేశంలోని అన్ని పోర్టులకు కంటైనర్ స్కానర్లను అందుబాటులో తెస్తామని అన్నారు. ఓడరేవు పోర్టుకు సమస్యలు లేకుండా చూస్తామని రాష్ట్ర సర్కారు చెప్పిందని, 3 వేల ఎకరాలు ఇస్తే ఏపీలో పోర్టు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విషయంపై ప్రతిపాదనలు పంపామని అన్నారు. అలాగే, కృష్ణానదిలో క్రూజ్‌ టెర్మనల్‌ కూడా ఏర్పాటవుతుందని గడ్కరీ చెప్పారు.  

ఇక మరోవైపు కేంద్ర అరోగ్య మంత్రి జేపీ నడ్డా గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో కేంద్రం నిధులతో నిర్మితమవుతున్న ఎయిమ్స్ అసుపత్రి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిమ్స్ నిర్మాణపనులను గడువుకంటే ముందుగానే పూర్తి చేసి, ఏపీ ప్రజలకు కానుకగా ఇస్తామని నడ్డా తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ మంగళగిరిలో ఎయిమ్స్ ను నెలకొల్పారని... రూ. 1618 కోట్లతో ఎయిమ్స్ ను నిర్మిస్తున్నామని చెప్పారు. ఆగస్టు నెలలో వైద్య విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తామని, మెరుగైన ఫ్యాకల్టీని అందిస్తామని తెలిపారు. 2019 జనవరి నాటికి ఔట్ పేషెంట్ బ్లాక్ ను సిద్ధం చేస్తామని చెప్పారు. అనంతరం నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles