AP former cm nallari kirankumar joined congress మాతృ సంస్థ కాంగ్రెస్ గూటికి నల్లారి..

Ap former cm nallari kirankumar joined congress

Jai Samaikyandhra Party. nallari kirankumar reddy, congress, rahul gandhi, oommen chandy, assembly elections, andhra pradesh, politics

United Andhra Pradesh last chief minister Nallari Kirankumar Reddy who floated a new political party Jai Samaikyandhra Party in the last elections and lost even deposits, joined congress in the leadership of Rahul Gandhi.

మాతృ సంస్థ కాంగ్రెస్ గూటికి నల్లారి.. అహ్వానించిన రాహుల్..

Posted: 07/13/2018 01:11 PM IST
Ap former cm nallari kirankumar joined congress

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా సేవలందించిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. రాష్ట్రం విడిపోయిన క్రమంలో తన అనుచరగణంతో కలసి జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించి.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ ఒక్క సీటు గెలుచుకోలేక అబాసుపాలై.. రాజకీయాల నుంచి నాలుగేళ్లుగా దూరంగా వున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు. గత నాలుగేళ్లుగా స్థబ్దుగా వున్న ఆయన మళ్లీ తన మాతృ పార్టీకే వచ్చేశారు.

ఆయనకు బీజేపి సహా పలు పార్టీలు స్వగతం పలికాయని.. ఆయినా వాటిని వినమ్రంగా తోసిపుచ్చారని ఊహాగానాలు వచ్చినా.. తనకు రాజకీయ ప్రాధాన్యతను కల్పించి.. స్పీకర్ గా, ముఖ్యమంత్రిగా అవకాశమిచ్చే సేవ చేసే బాగ్యం కల్పించిన కాంగ్రెస్ లోనే చేరిపోయారు. గత వారం రోజులుగా ఆయన మళ్లీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చాయి. ఇక ఇవాళ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాంధీ అధ్యక్షతన హస్తినకు వెళ్లిన ఆయన ఇవాళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీలో చేరారు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డితో పాటు కేంద్రమాజీ మంత్రి పల్లం రాజు కూడా వెంటవున్నారు.

రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డి పై మువ్వన్నెల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తరువాత కిరణ్ తో సమావేశమైన రాహుల్, నేతలంతా కలసి ఎన్నికల్లో విజయం దిశగా కలసి పనిచేయాలని సూచించారు. పార్టీలో సముచిత స్థానం ఇచ్చే విషయాన్ని తాను చూసుకుంటానని అన్నారు. కాగా, కిరణ్ పార్టీలో చేరికతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని, విభజన సమయంలో పార్టీని వీడిన పలువురు నేతలు తిరిగి వెనక్కు తీసుకు రావచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles