Double celestial treat coming up this month ఐదు రోజుల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలు

Double delight for skylovers earth to witness lunar eclipse on july

lunar eclipse India, Moon, Mars closest to earth, Mars, celestial event, Jupiter, double celestial delight, celestial delight

With Mars closer than it has been in 15 years, almost double the brilliance of Jupiter through the naked eye, and the longest total lunar eclipse of the century, space enthusiasts can tune into the skies for a double celestial delight this month.

ఐదు రోజుల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలు

Posted: 07/09/2018 12:48 PM IST
Double delight for skylovers earth to witness lunar eclipse on july

ఐదు రోజుల వ్యవధిలో రెండు ఖగోళ అద్భుతాలకు జులై మాసం వేదిక కానుంది. ఐదు రోజుల వ్యవధిలోనే అద్భుతాలు కనువించు చేయనుండటంతో ప్రపంచలోని అనేక మంది వాటి అవిష్కృతం కోసం అసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలుత ఈ నెల 27న (గురు పౌర్ణమి) రోజున సుదీర్ఘ సంపూర్ణ చంద్రగ్రహణం చోటుచేసుకోనుంది. సుదీర్ఘం అంటే నిమిషాల్లో కాకుండా ఏకంగా సుమారు రెండు గంటల సమయం ఈ గ్రహణ సమయం సాగనుంది. ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘ సమయం.. అంటే 1.43 గంటల పాటు చంద్రగ్రహణం సాగుతుంది.

సరిగ్గా భారత్ కాలమానం ప్రకారం రాత్రి 11.54 గంటల తర్వాత ఈ అద్భుతం దర్శనమిస్తుంది. అప్పటి నుంచి రమారమి అర్థరాత్రి ఒంటిగంట నలబై నిమిషాల వరకు గ్రహణం కొనసాగనుంది. రాత్రి రెండు గంటల తరువాత గ్రహణం వీడనుంది. దీంతో పవిత్ర గురుపౌర్ణమి రోజైనప్పటికీ.. సాయంత్రం జరగాల్సిన సద్గురు షిరిడీ సాయి.. పల్లకీ సేవ సహా పలు నిత్య కైంకర్యాలతో పాటు ప్రత్యేక పూజలను కూడా ఆలయాలు రద్దు చేస్తున్నాయి. ఆలయాలు మధ్యహ్నం తరువాత మూసివేయనున్నారు. కాగా, ఈ అద్భుతాన్ని భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వీక్షించొచ్చు.

ఇక ఈ అద్భుతం జరిగిన తరువాత నాలుగు రోజున అంటే ఈ నెల 31న మరో ఖగోళ అద్భుతం అవిష్కృతం కానుంది. అదేంటంటే.. అంగారక గ్రహం.. భూమికి చేరువగా చేరుకోనుంది. ఆ సమయంలో రెండు గ్రహాల మధ్య దూరం 5.76 కోట్ల కిలోమీటర్ల మేర ఉంటుంది. 2003 తర్వాత అంగారకుడు మనకు ఇంత చేరువగా రావడం ఇదే మొదటిసారి. అయితే 2003లో 5.57 కోట్ల కిలొమీటర్ల చేరువలోకి వచ్చింది. 60వేల సంవత్సరాల్లో అదే అత్యంత కనిష్ఠ దూరం.

ఈ నెల 31న సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం నడుమ అంగారకుడిని వీక్షించొచ్చు. ఎలాంటి టెలిస్కోపు లేకుండా కంటితోనే దీన్ని చూడొచ్చని నిపుణులు తెలిపారు. సూర్యాస్తమయం తర్వాత తూర్పు-ఆగ్నేయ దిశలో ఆ గ్రహం కనపడుతుందన్నారు. ఒక మోస్తరు స్థాయి టెలిస్కోపుతో చూస్తే అంగారక గ్రహంపైనున్న మంచు ఫలకాలనూ చూడొచ్చని చెప్పారు. మళ్లీ 2035లో ఆ గ్రహం భూమికి చేరువగా వస్తుందని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles