Unnao: Molestation video goes viral, cops arrest two ఉన్నావ్ మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్

Three men molest women in uttar pradesh s unnao they made a video

three youngsters molestated unnao women, unnao women molestated video goes viral, FIR, molestation, Shocker From Unnao, unnao, uttar pradesh, video goes viral, woman, youngsters, Unnao, Molestation, viral video, video viral, Uttar pradesh, Crime

In a shocking incident, a video has gone viral in Uttar Pradesh’s Unnao, in which three men can be seen molesting a woman.

ITEMVIDEOS: ఉన్నావ్ లో మరో దారుణం.. మహిళపై అత్యాచారం.. వీడియో వైరల్

Posted: 07/06/2018 12:04 PM IST
Three men molest women in uttar pradesh s unnao they made a video

ఉత్తరప్రదేశ్ లోమరో దారుణం జరిగింది. ఉన్నావ్ లో ఓ యువతిపై స్థానిక ఎమ్మెల్యే.. అయన సోదరుడు ఏకంగా సామూహిక అత్యాచారానికి తెగబడిన నేపథ్యంలో ఎమ్మెల్యే సహా నిందితులపై చర్యలు తీసుకోవాలని యువతి పోలిస్ స్టేషన్ కు వెళ్లినా,. ముఖ్యమంత్రి యోగీ అదిత్యనాథ్ కార్యాలయానికి వెళ్లిన పిర్యాదు చేసినా.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు కరువవ్యడంతో యావత్ దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబిక్కడంతో.. పరిస్థితిని గమనించిన బీజేపి అధిష్టానం గత్యంతరం లేని పరిస్థితుల నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించి ఎమ్మెల్యే సహా ముగ్గురుని అరెస్టు చేసిన ఘటనను ఇంకా మర్చిపోకముందే.. అలాంటిదే మరో దారుణ ఘటన జరిగింది.

ఏకంగా ఎమ్మెల్యే గ్యాంగ్ రేప్ చేయడాన్ని అక్కడి యువత అదర్శంగా తీసుకుందా.? చెడుకు త్వరగా అకర్షితులయ్యే యువత.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. అటవీ ప్రాంతంలో కట్టెల కోసం వచ్చిన ఓ మహిళ పట్ల ముగ్గురు యువకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. కాగా నాలుగో యువకుడు ఈ యావత్ ఘటనను తన మొబైల్ ఫోనులో వీడియో తీయడానికే సమయాన్ని కేటాయించాడు. అన్నా వదిలేయండీ అని బాధితురాలు వేడుకున్నా.. కాళ్ల పట్టుకున్నా యువకులు కనికరించలేదు.

వంట నిమిత్తం.. అడవిలోకి కట్టెలు కొట్టేందుకు వచ్చిన ఓ మహిళకు తారసపడ్డ నలుగురు యువకులు అమెను సమీపించి అమెపై లైంగికదాడికి పాల్పడ్డారు. అమె వద్దు నాపై అలాంటి అఘాయిత్యాలు చేయకండీ అంటూ అర్థించింది., అయినా వారు కనుకరించలేదు. అడవి లోనికి లాక్కువెళ్లారు. అన్నా వదిలేయండి అని బాధితురాలు వేడుకుంటున్నా నిర్థాక్షిణ్యంగా అమెను బలవంతంగా లాక్కెళ్లారు. చివరకు బాధిత మహిళ కామాంధుల చెర నుంచి తప్పించుకుని వెళ్లింది. అయితే కామాంధులు మాత్రం అమె వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనపై చర్యలు తీసుకున్న అధికారులు నిందితుల్లోని ఇద్దర్ని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో వున్నారని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  youngsters  Unnao  Molestation  viral video  video viral  Uttar pradesh  Crime  

Other Articles