Kejriwal Gets A Reality Check again సుప్రీం తీర్పు తరువాత కూడా కేజ్రీవాల్ కు ఎల్జీ చెక్..

After big win in sc kejriwal gets a reality check

arvind kejriwal, anil baijal, delhi, delhi power tussle, supreme court, lg anil baijal, aam aadmi party, supreme court order, supreme court judgement, council of ministers, dipak misra cji, AAP, Anil Baijal, Arvind Kejriwal, Delhi Centre Power, Lieutenant Governor, Supreme Court verdict

The Lt Governor and top bureaucrats would continue to decide on transfer and posting of officials till the 2016 directive is either cancelled by the court or replaced with a new order pre-approved by Lt Governor Anil Baijal.

సుప్రీం తీర్పు తరువాత కూడా కేజ్రీవాల్ కు ఎల్జీ చెక్..

Posted: 07/05/2018 10:37 AM IST
After big win in sc kejriwal gets a reality check

న్యూఢిల్లీని పరిపాలన విషయంలో ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన ప్రభుత్వం ప్రతీ అంశంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ అమోదం పోందాల్సిన అవసరం లేదని.. అయితే సమాచారం మాత్రం చేరవేయాల్సిందేనని.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే ప్రజాస్వామ్యంలో పెద్దపీటని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలురించినా.. ఢిల్లీలోని లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం ఇంకా తానే గోప్ప అన్నట్లు గా వ్యవహరస్తున్నారని, ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా లక్ష్యపెట్టడం లేదని, కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్నారని అప్ నేతలు అరోపిస్తున్నారు.

ఢిల్లీని పాలించాల్సింది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమేనని, లెఫ్టినెంట్ గవర్నర్ వారధిగా ఉండాలే తప్ప ప్రతి విషయంలోనూ కలుగజేసుకుంటూ పాలనను అస్తవ్యస్థం చేయరాదని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత ఆప్ ప్రభుత్వం ఇచ్చిన తొలి ఆర్డర్ తిరస్కరణకు గురైంది. కోర్టు తీర్పు వెలువడిన గంటల తరువాత, అధికారులను బదిలీ చేసే అధికారాన్ని స్వయంగా చూసుకుంటామని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా, ఇంత ముఖ్యమైన బదిలీల విభాగానికి లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే ఇన్ చార్జ్ గా ఉంటారని చెబుతూ, ఆ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్టు ఎల్జీ కార్యాలయం ప్రకటించింది.

లెప్టినెంట్ గవర్నర్ తాజా నిర్ణయంపై మండిపడ్డ ఆప్ నేతలు, సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పును సైతం బీజేపీ పక్కన బెడుతోందని విమర్శించారు. "నిన్నటి తన తీర్పులో కోర్టు స్పష్టంగా చెప్పింది. కేవలం భూమి, పోలీస్, పబ్లిక్ ఆర్డర్ విభాగాలు మాత్రమే కేంద్రం పరిధిలో ఉంటాయని, మిగతా అన్ని విషయాల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు పనులు జరగాలని చెప్పింది. అంటే బదిలీల విషయంలో ఎల్జీకి అధికారం లేదు. కోర్టు తీర్పును వీరు ధిక్కరిస్తున్నారు" అని ఆప్ నేత ఒకరు ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఎల్జీ బదిలీ ఆదేశాలు, పోస్టింగులపై సంతకాలు చేసే వీల్లేక పోయినప్పటికీ పట్టించుకోవడం లేదని, సీఎంగా ఉన్న కేజ్రీవాల్ కే బదిలీల అధికారం ఉందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles