“Big Win for Democracy”: Kejriwal సుప్రీం తీర్పుపై కేజ్రీ హర్షం.. ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్య

In big win for arvind kejriwal sc rules against lg in delhi

arvind kejriwal, anil baijal, delhi, delhi power tussle, supreme court, lg anil baijal, aam aadmi party, supreme court order, supreme court judgement, council of ministers, dipak misra cji, AAP, Anil Baijal, Arvind Kejriwal, Delhi Centre Power, Lieutenant Governor, Supreme Court verdict

In a landmark judgement for CM Arvind Kejriwal, the Supreme Court said Lieutenant Governor Anil Baijal does not have independent decision-making powers and is bound to act on the aid and advice of the Council of Ministers.

సుప్రీం తీర్పుపై కేజ్రీ హర్షం.. ప్రజాస్వామ్యం గెలిచిందని వ్యాఖ్య

Posted: 07/04/2018 02:16 PM IST
In big win for arvind kejriwal sc rules against lg in delhi

న్యూఢిల్లీని పరిపాలన విషయంలో ప్రజాస్వామ్యబద్దంగా గెలిచిన ప్రభుత్వం ప్రతీ అంశంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి పొందాలా.? అమోదం పోందిన వాటిని మాత్రమే అమలు పర్చాలా.? అన్న గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న మిమాంసకు ఎట్టకేలకు తెరపడింది. కేంద్రం నియమించే లెఫ్టినెంట్ గవర్నర్ పెత్తనం సాగదని.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానిదే ప్రజాస్వామ్యంలో పెద్దపీటని దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలురించింది.

ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు, ఎల్జీ మధ్య జరుగుతున్న కోర్టు కేసులో అత్యున్నత న్యాయస్థానం కొద్దిసేపటి క్రితం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా ఉండటం గమనార్హం. లెఫ్టినెంట్ గవర్నర్ ఓ కాపలాదారుగా వ్యాఖ్యానించిన ధర్మాసనం, ఢిల్లీ ప్రజలను పాలించాల్సింది వారు ఎన్నుకున్న ప్రభుత్వమేనని తేల్చి చెప్పింది. ఢిల్లీ ముఖ్యమంత్రి, తన మంత్రివర్గ సహచరులతో చర్చించి ఎటువంటి నిర్ణయాన్ని అయినా తీసుకోవచ్చని, అయితే, ఆ నిర్ణయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలియజేయాల్సి వుంటుందని రాజ్యాంగంలో స్పష్టంగా రాసుందని పేర్కొంది.

ఇదే సమయంలో ఎల్జీ సమ్మతి కోసం వేచి చూడక్కర్లేదని తెలిపింది. ఎల్జీ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని, ప్రభుత్వ నిర్ణయాలు నచ్చకుంటే, ఆ విషయాన్ని రాష్ట్రపతికి చేరవేయాలే తప్ప, మొండిపట్టు పట్టరాదని తెలిపింది. ఈ కేసు ఎంతో ప్రత్యేకమైనదని అభిప్రాయపడ్డ జస్టిస్ చంద్రచూద్, ప్రజల నిర్ణయాన్ని ఎవరైనా ఆమోదించాల్సిందేనని అన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోవచ్చని, ప్రతి విషయానికీ అడ్డుపడరాదని తీర్పు సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.

ఢిల్లీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ గా వ్యవహరించే లెఫ్టినెంట్ గవర్నర్, మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను అడ్డుకోలేరని ఆయన అన్నారు. అటు ఎల్జీ, ఇటు సీఎం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తే ఎటువంటి సమస్యా ఉండదని అభిప్రాయప్డారు. ఇక ఈ తీర్పు చాలా బాగుందని మాజీ అటార్నీ జనరల్ సొలీ సొరాబ్జీ వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వెలువరించిన కీలక తీర్పును స్వాగతించిన, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు. ఇది ఢిల్లీ ప్రజలు సాధించిన ఘన విజయమని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లకు ప్రజాస్వామ్యం గెలిచిందని అన్నారు. సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరిస్తూ, కేజ్రీవాల్ కు పాలనాపరంగా మరింత స్వేచ్ఛను ఇచ్చేలా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎల్జీ పాత్ర పరిమితమేనని, పెత్తనం చెలాయించేందుకు కాదని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles