ఇటు బాలీవుడ్ అటు హాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ.. గత నాలుగు పర్యాయాలుగా యువకుల మనస్సులో తిష్టవేసిన శృంగార తార అవార్డను సొంత చేసుకుని ఈ మధ్యే ప్రేమలో పడిన నటి ప్రియాంక చోప్రాకు అధికారులు షాకిచ్చారు. సినీనటిగా, సెలబ్రిటీగా గుర్తింపు వున్నా.. వాటన్నింటినీ పక్కనబెట్టిన బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అమెకు నోటీసులు జారీ చేసింది. అంథేరీ దక్షిణ ప్రాంతంలో ఈ నటికి ఒషివారా అనే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది.
అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తాజాగా మున్సిపల్ అధికారులు తేల్చారు. ఈ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 2013లో మున్సిపల్ అధికారులు ఓ ప్లాన్‌కి అంగీకారం తెలిపారు. ఇంతవరకు బాగానే వున్నా.. వాస్తు కోసం.. అక్రమంగా కొన్ని నిర్మాణాపు పనులు చేపట్టడంతో అక్కడే తేడా కొట్టింది. అక్రమంగా నిర్మాణాలు జరిపినట్లు తాజా తనిఖీల్లో గుర్తించిన అధికారులు గుర్తించారు. దీంతో అమెకు నోటీసులు జారీ చేశారు.
ఒషివారాలో అక్రమ నిర్మాణాలు చేశారని.. ఇటీవల మున్సిపల్ అధికారులకి ఐదుగురు ఫిర్యాదు చేశారు. తాజాగా అధికారులు తనిఖీలు నిర్వహించగా.. ప్లాన్ ప్రకారం కాకుండా.. నిర్మాణాలు చేపట్టినట్లు తేలింది. దీంతో వెంటనే ఆ అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందిగా ప్రియాంక చోప్రాకి రెండు నోటీసులు జారీ చేశారు. ఒకవేళ నోటీసులకి స్పందించకుంటే.. తామే వాటిని కూల్చివేస్తామని అందులో మున్సిపల్ అధికారులు హెచ్చరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more