"pawan kalyan is grand alliance cm candidate" పవన్ కల్యాణే మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి

Pawan kalyan is grand alliance cm candidate ramakrishna

pawan kalyan cm candidate, left parties announces cm candidate, pawan kalyan, CM candidate, janasena, rama krishna, uttarandhra porata yatra, Pawan Kalyan bus Yatra, pawan kalyan porata yatra, pawan kalyan press meet, pawan kalyan srikakulam yatra, pawan kalyan ichhapuram yatra, Pawan Kalyan uttatandhra yatra, andhra pradesh, politics

Actor turned politician Jana Sena chief pawan kalyan will be Chief minister candidate in the forth comming elections announced cpi state secrtary ramakrishna, who is to step into debutant direct elections having an alliance with left parties.

పవన్ కల్యాణే మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి

Posted: 07/02/2018 11:52 AM IST
Pawan kalyan is grand alliance cm candidate ramakrishna

తొలిసారిగా ప్రత్యక్ష ప్రజాక్షేత్రంలోకి దిగుతున్న జనసేన పార్టీ.. రానున్న ఎన్నికలలో వామపక్షాలతో కలసి పోరాడేందుకు సిద్దమని ఇప్పటికే తెలిపారు. జనసేనతో కలసి సీపీఎం, సీపీఐ పార్టీలు ఎన్నికలకు వెళ్లున్నాయని, ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాన్ తో కలసి చర్చించి నిర్ణయం తీసుకున్నామని సీపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తాజాగా తమ కూటమి అభ్యర్థి ఎవరన్న విషయాన్ని కూడా వామపక్షాలు ప్రకటించాయి.

రానున్న ఎన్నికల నేపథ్యంలో మహా కూటమి ఏర్పడితే ముఖ్యమంత్రి అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణే అని సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. వామపక్ష భావాలతో.. పాలన విధానాల్లో  మార్పు రావాలని తీవ్రంగా శ్రమిస్తున్న వ్యక్తి పవన్ కల్యాన్ అని.. ప్రజలకు నిజమైన మేలు జరగాలంటే పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయాలపై పవన్ కు స్పష్టమైన అవగాహన ఉందని చెప్పారు. పవన్ కు ఇమేజ్, క్రేజ్ తో పాటు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్న తపన కూడా వుందని అన్నారు.

కర్నూలు జిల్లా ఆలూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన పైవ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 85 శాతం నిధులు ఇచ్చిందంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో ఏ పార్టీ అయినా ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని పొత్తులు పెట్టుకుంటే... వారికి ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తనకు రెండేళ్ల సమయం ఇస్తే... కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తానంటూ గాలి జనార్దనరెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని... వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలతో ఈ నెల 4న విజయవాడలో సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles