plane crashes in Mumbai, five killed జనవాసాల మధ్య కుప్పకూలిన విమానం.. వణికిన ముంబై నగరం..

Chartered plane crashes in mumbai s ghatkopar five killed

Mumbai plane crash, Ghatkopar, plane crash mumbai, mumbai plane clash, chartered aircraft, ghatkopar plane crash, death, VTUPZ Crashe, mumbai news

Five people died when a small chartered plane hit a partially-constructed building in Mumbai’s Ghatkopar (West) on Thursday.

ITEMVIDEOS: జనవాసాల మధ్య కుప్పకూలిన విమానం.. వణికిన ముంబై నగరం..

Posted: 06/28/2018 03:13 PM IST
Chartered plane crashes in mumbai s ghatkopar five killed

దేశ అర్థిక రాజధాని ముంబై నగరం వణికిపోయింది. జూహు విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే క్రమంలో ఘట్కోవర్ ప్రాంతంలో చార్డెడ్ విమానం ఒక్కసారిగా జనవాసాల మధ్య కుప్పకూలింది. భారీ విస్పోటనంతో అకస్మాత్తుగా మంటలు కూడా చెలరేగి వ్యాపించిన క్రమంలో.. ముంబై నగరవాసులు భయకంపితులయ్యారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ల్యాడింగ్ అయ్యే క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదఘటనలో ఒక పైలట్ సహా ముగ్గురు విమాన సిబ్బందితో పాటుగా మరో పాదచారి మొత్తం ఐదుగురు మృత్యువాత పడ్డారు. ఘటన సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగి మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఈ విమానం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన యుఐ సంస్థకు చెందినదని అధికారులు వెల్లడించారు. 2004లో అప్పటి యూపీఏ ప్రభుత్వం నుంచి యూఐ సంస్థ VT-UPZ ఎయిర్ క్రాఫ్ట్ ను కొనుగోలు చేసింది. అయితే సాంకేతిక లోపాలు తలెత్తడంతో ఈ విమానానికి నాలుగు రోజుల క్రితమే రిపేర్లు చేశారు. కాగా ఇవాళ టెస్టు డ్రైవ్ చేపట్టిన విమాన సంస్థ.. ఈ సందర్భంగా పైలట్ తో పాటు సాంకేతిక లోపాలను సరిచేసేందుకు ఇద్దరు ఏరోనాటికల్ ఇంజనీర్లతో పాటు మరో టెక్నికల్ సిబ్బంది కూడా విమానంలో ప్రయాణించారు.

కాగా, అంత సవ్యంగా సాగి.. చివరకు ల్యాండింగ్ అయ్యే క్రమంలో జనవాసాల మధ్య కుప్పకూలింది. ఎయిర్ క్రాఫ్ట్ లో ఎంత మంది ఉన్నారు.. వారు ఎవరు అనే విషయాలను యూపీ ప్రభుత్వం తెలియజేయాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, మున్సిపాలిటీతోపాటు ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు కూడా స్పాట్ కు చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles