pawan worries of seperate movement from uttarandhra మరో ఉద్యమం రాకముందే మేల్కొండి: పవన్

Pawan kalyan worries of another movement like telangana from uttarandhra

pawan kalyan, janasena, pawan kalyan porata yatra, Pawan Kalyan uttatandhra yatra, seperate movement, uttarandhra, telanagana movement, Pawan Kalyan news, Pawan Kalyan updates, Pawan Kalyan latest, Pawan Kalyan new, Pawan Kalyan next, Pawan Kalyan speech, Pawan Kalyan pressmeet, andhra pradesh, politics

After Telangana movement made state bifurcated, Jana Sena chief pawan kalyan worries about another movement from uttaranadhra, as the government is neglecting these region.

ఉత్తరాంధ్రలో మరో ఉద్యమం రాకముందే మేల్కొండి: పవన్

Posted: 06/27/2018 08:17 PM IST
Pawan kalyan worries of another movement like telangana from uttarandhra

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దారితీసేలా ఉత్తరాంధ్ర సమస్యలున్నాయని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉత్తరాంధ్రపై పాలకులు దృష్టిపెట్టకపోతే మరో తెలంగాణ అవుతుందని ఆయన హెచ్చరించారు. విశాఖలో ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశమైన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం లా మారకముందే... ఆ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుండి వలస వెళ్లిన వారికి కుదిరితే హెక్టార్ చొప్పున భూమి కొని ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అన్నారు.

ఉత్తరాంధ్రలో పర్యటిస్తుంటే తనపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చాలా ఉద్రేకం కలిగిందని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఉద్రేకాలు రెచ్చగొడుతున్నావు అని ఆయన వ్యాఖ్యానించారని... క్షేత్రస్థాయిలో ప్రజల బాధలు తెలుసుకోవడానికే తాను యాత్ర చేస్తున్నానని స్పష్టం చేశారు పవన్. వైజాగ్ లో ప్రజా ప్రతినిధులు అంతా వలస వచ్చినవారేనని మండిపడ్డ జనసేనాని... ఉత్తరాంధ్ర ప్రజలలో ఉద్యమ స్ఫూర్తి ఉంది... కానీ నాయకుల్లో మాత్రమే అది కనిపించడం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ స్థానిక నేతకు ప్రాధాన్యత ఇస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

స్థానికులకు నిత్యం అందుబాటులో వుంటూ.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే నేతకే.. తాను జనసైన్యం పార్టీ టిక్కెట్ ను ఇస్తానని చెప్పారు. శ్రీకాకుళంలో కావాలనే వినాశనం చేసే పరిశ్రమలు పెట్టాలని చూస్తున్నట్టు తనకు సందేహం కలుగుతోందని పవన్ అనుమానం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏ మూలకు వెళ్లినా సమస్యలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... వైసీపీ అధికారంలోకి వస్తే భూములు కబ్జా చేస్తారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు... కానీ, టీడీపీ వాళ్లే విశాఖలో లక్ష ఎకరాలు కబ్జా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇక తెలంగాణకు వలస వెళ్లిన 26 కులాలను స్థానికులుగా గుర్తించాలని తెలంగాణ ముఖ్యమంత్రిని కోరతానని వెల్లడించారు పవన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  janasena  seperate movement  uttarandhra  telanagana movement  andhra pradesh  politics  

Other Articles