'Fined for offering lift to men stuck in rain' ‘‘అయ్యో పాపం.. అని లిఫ్టు ఇచ్చినా’’.. నేరమేనా.?

Do not give a lift to strangers traffic police will fine you says nitin nair

Traffic cops, State Transport Authority (Victoria), Navi Mumbai, information technology, gandhinagar, Automobile, traffic police, penalised, downpour, Airoli circle, Facebook, andheri, mumbai, crime

Navi Mumbai resident Nitin Nair was fined by the court after traffic police fined him for offering lift to a group of people, including an elderly man, stranded in rain.

‘‘అయ్యో పాపం.. అని లిఫ్టు ఇచ్చినా’’.. నేరమేనా.?

Posted: 06/25/2018 11:16 AM IST
Do not give a lift to strangers traffic police will fine you says nitin nair

ముక్కుమొహం తెలియని అపరిచితులకు లిఫ్ట్ ఇవ్వడం కూడా నేరమని భారత దేశంలో ఎంతమంది వాహనదారులకు తెలుసు. అయితే ఓ సాప్ట్ వేర్ ఉధ్యోగి మూలంగా ఇప్పుడీ విషయం దేశంలోని అనేకమందికి తెలిసింది. అదేంటి నిజంగా లిప్ట్ ఇవ్వడం నేరమా.. అంటే అపరిచితులకు లిప్ట్ ఇవ్వడం నేరమే. ఇలా అని మోటార్ వాహనాల చట్టంలో కూడా నిబంధన వుంది. దానిని అతిక్రమిస్తే.. జరిమాన కట్టక తప్పదు. ఈ నిబంధన తెలియని సాప్ట్ వేర్ ఉద్యోగి.. ఏకంగా న్యాయస్థానానికి వెళ్లి అక్కడ జరిమానా కట్టాల్సి వచ్చింది.

తన మాదిరిగానే అనేక మంది వాహనదారులకు ఈ విషయం తెలియకపోవడంతో.. తన అనుభవాన్ని ఆయన సామాజిక మాద్యమం ద్వారా పంచుకున్నారు. అంతేకాదు ఇలా చేస్తే జరిమానాలు కట్టాల్సి వస్తుందంటూ హెచ్చరించాడు కూడా. దీంతో ఆయన పోస్టు నెట్టింట్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మహారాష్ట్రలోని దేశ అర్థిక రాజధాని ముంబై ప్రాంతంలోని అరోలికి చెందిన ఓ సాప్టువేర్ ఇంజనీరు తన కారులో అంధేరీలోని తన కార్యాలయానికి బయలుదేరారు.

అయితే జోరున వర్షం కురుస్తుండటంతో కాస్తా నమ్మెదిగానే వెళ్లసాగాడు. ఈ క్రమంలో అతనికి మార్గమధ్యంలో బస్సుల కోసం వేచి చూస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లిప్ట్ అడగటంతో వారిని ఎక్కించుకున్నాడు. ఇంతలో అక్కడే వున్న పెద్దాయన కూడా తాను వస్తానని అభ్యర్థించడంతో.. వారిని కారులో ఎక్కించుకుని లిఫ్ట్ ఇద్దామని ముందుకు కదిలాడు. అయితే అంత వర్షంలో సాయం చేసిన వ్యక్తిని అభినందించాల్సింది పోయి.. అతనిని గమనించి.. అతని డ్రైవింగ్ లైస్సెన్సు తీసుకున్న ట్రాఫిక్ పోలీసులు చలానాను చేతిలో పెట్టేసరికి అతను షాక్ అయ్యాడు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫైన్ కట్టి లైసెన్స్ తీసుకెళ్లాలని అదేశించారు. దీంతో మరుసటి రోజున పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన నితిన్ ను న్యాయస్థానానికి వెళ్లి.. అక్కడ జరిమానా కట్టాలని సూచించారు. దీంతో చేసేది లేక న్యాయస్థానానికి వెళ్లిన నితిన్.. అక్కడ జరిమాన కట్టి బయటపడ్డాడు. సెక్షన్ 66/192 ప్రకారం అజ్ఞాత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వడం నేరమని పోలీసులు చెప్పారని, కాబట్టి ఇకపై ఎవరూ అటువంటి పనులు చేయవద్దని హెచ్చరించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navi Mumbai  nitin nair  traffic police  penalised  downpour  Airoli circle  Facebook  andheri  mumbai  crime  

Other Articles