prakash lashes out at PM Modi చారిత్రక అవకాశమన్న ప్రధానికి ప్రకాష్ రాజ్ చురక

Prakash raj takes dig at pm modi justasking continues in j k

prakash raj, just asking, PM Modi, jammu and kashmir, Mehbooba Mufti, Governor, NN Vohra, BJP president Amit Shah, j&k politics

After BJP has ended its alliance with PDP in Jammu and Kashmir, Southindian Actor Prakash raj ask BJP is this wash your hands off, or is it withdrawl symptoms of 2019.

చారిత్రక అవకాశమన్న ప్రధానికి ప్రకాష్ రాజ్ చురక

Posted: 06/19/2018 05:19 PM IST
Prakash raj takes dig at pm modi justasking continues in j k

జమ్ముకశ్మీర్ లో తాము అధికార పీడిపీ పార్టీతో ఏర్పర్చుకున్న కూటమిని తెగదెంపులు చేసుకున్న బీజేపి ఇక రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా గవర్నర్ కు కోరింది. ఈ నేపథ్యంలో ఏకంగా ప్రధాని నరేంద్రమోడీ గతంలో ఈ అంశంపై  చేసిన ట్వీట్ ను ఊటంకస్తూ.. దెప్పిపోడిచే ప్రయత్నం చేశారు దక్షిణాది సినీనటుడు ప్రకాష్ రాజ్. జమ్మూకాశ్మీర్ ప్రజల అకాంక్షలను పూర్తి చేయడానికి బీజేపి-పీడీపీ ప్రభుత్వానికి లభించిన చక్కని చారిత్రక అవకాశమని ప్రధాని కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన సందర్భంగా అభివర్ణించిన విషయాన్ని పేర్కోన్నారు ప్రకాష్ రాజ్.

ప్రధాని ఆ ట్వీట్లో జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రగతిని సరికోత్త శిఖరాలకు తీసుకెళ్లే చక్కని అవకాశమని పేర్కోనడాన్ని ప్రస్తావించిన ప్రకాష్ రాజ్.. ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట ఓ ట్వీట్ చేశారు. ‘ఇతరుల సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవాలని ఏ విధంగానైతే బీజేపీ ప్రార్థిస్తుంటుందో.. వేచిచూస్తుంటుందో.. కశ్మీర్లో వారి సంకీర్ణాన్ని కూడా బీజేపీ అలాగే బ్రేక్ చేసింది..ఇలా చేసి చేతులు కడిగేసుకున్నారా?.. లేక.. 2019 ఎన్నికల్లో వెనుకడుగు పడుతోందనేందుకు సూచనలా..?’ అని ప్రకాష్ రాజ్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles