Rs 12 lakh worth of notes destroyed by rats ఏటియంపై ఎలుకల సర్జికల్ స్ట్రైక్.. చిత్తు కాయితాలైన కరెన్సీ నోట్లు..

Mice launch surgical strike on an sbi atm in assam

mice, rat, mice tore notes, atm, Tinusukia, rats surgical strike, rats demonetisation, rat-attack, assam, Tinsukia Police Station, Global Business Solutions

An ATM in Tinsukia district of Assam witnessed shredded 500 and 2000 notes on 11th June after a few repairmen arrived at the outlet to fix the machine.

ఏటియంపై ఎలుకల సర్జికల్ స్ట్రైక్.. చిత్తు కాయితాలైన కరెన్సీ నోట్లు..

Posted: 06/19/2018 11:36 AM IST
Mice launch surgical strike on an sbi atm in assam

ఓ వైపు  ఏటీఎం కేంద్రాలలో డబ్బులేక నగదు కొరతతో మొర్రో అని వాపోతున్న వేళ, ఏటీయం సిబ్బంది నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఏర్పాటైన ఏటీయం కేంద్రాలలో డబ్బు లేక బోసిపోయిన ఏటీయం యంత్రాలు దర్శనమిస్తుంటే.. ఇక్కడ మాత్రం బోలెడన్నీ నోట్లు వున్నా.. అవి ఎందుకూ పనికిరాని చిత్తుకాయితాలుగా మారిపోయి.. అధికారుల, ఏటీయం సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఈ ఏటీయం కేంద్రంలోని నోట్లపై ఓ మూషికం సర్జికల్ స్ట్రైక్ చేసి.. కరెన్సీ నోట్లను కాస్తా చిత్తుకాయితాలుగా చేసింది. ఇంతకీ వాటి విలువెంతో తెలుసా.? అక్షరాల 12 లక్షల పైమాటే.

ఈ విచిత్ర ఘటన అసోంలోని గౌహతి సమీపంలోని టిన్సుకియా లైపులి అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల.. ఎలా చేరిందో కానీ ఓ మూషికరాజు టిన్సుకియా ప్రాంతంలోని ఎస్బీఐ ఏటియం వద్దకు చేరింది. ఇక అలికిడి కావడంతో.. నేరుగా ఏటీయంలోకి దూరిపోయింది. పద్మవ్యూహంలోకి వెళ్లిన అభిమన్యుడిలా ఎలుక పరిస్థితి తయారైంది. ఎలా వెళ్లిందన్న విషయాన్ని పక్కనబెడితే.. బయటకు వచ్చేందుకు మాత్రం మార్గం కనబడక.. నానా హైరానా పడిన ఎలుక.. కస్టమర్లు డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లి కార్డు స్పైప్ చేసిన సందర్భంలో ( తనకు తెలియకుండానే యంత్రంలో కదలికలు రావడంతో) కంగారు పడిన మూషికం.. ఇక తన పని తాను కానిచ్చింది.

ఏటీఎం కేంద్రంలోని యంత్రంలో వున్న కరెన్సీ నోట్లపై సర్జికల్ స్ట్రైక్ కానిచ్చింది. ఏకంగా రూ. 12.38 లక్షల నోట్లను తినేసింది. గత నెల19వ తేదీన ఈ ఏటీఎంలో రూ. 29.48 లక్షల విలువైన రూ. 2 వేలు, రూ. 500 నోట్లను అధికారులు నింపారని, ఆపై ఏటీఎం పనిచేయడం లేదని స్థానిక పత్రిక ఒకటి కథనాన్ని ప్రచురించింది. ఈ నెల 11వ తేదీన అధికారులు ఏటీఎంను ఓపెన్ చేయగా, మిగిలిన కరెన్సీ చిత్తు కాగితాల్లా కనిపించాయని, ఓ ఎలుక ఈ పని చేసిందని తెలుసుకుని అధికారులు అవాక్కయ్యారని పేర్కొంది. జరిగిన ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసును దర్యాఫ్తు చేస్తున్నారని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఏటీఎంలో చిత్తు కాగితాల్లా పడివున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rat  mice tore notes  atm  Tinusukia  rats surgical strike  rats demonetisation  rat-attack  assam  

Other Articles