banjara hills police on hunt for manikanta sai మణికంఠసాయి కోసం హైదరాబాద్ పోలీసుల వేట..

Banjara hills police on hunt for manikanta sai

cheating, cheating young girls, cheating young girls on the pretext of cinema chances, filmy oppurtunitunities, young girls trapped, movie chances, Fornication Relationship, Hyderabad, intimate photos, videos, blackmailer manikanta sai, manikanta sai, cheating, blackmailing, banjara hills police, hyderabad, telangana, crime news

banjara hills police on hunt for manikanta sai, who cheated young gilrs on the pretext of cinema chances and few on assurance of lending loans from banks

మణికంఠసాయి కోసం హైదరాబాద్ పోలీసుల వేట..

Posted: 06/18/2018 03:56 PM IST
Banjara hills police on hunt for manikanta sai

తెలుగు పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి వచ్చిన తరువాత అగ్రరాజ్యంలో టాలీవుడ్ అగ్రనటీమణులు హైప్రోఫైల్ సెక్స్ రాకెట్ ఊబిలో చిక్కకున్నారన్న వార్తలు కలకలం రేపుతుంన్న క్రమంలోనే.. సినిమాల్లో అవకాశాలను అవలీలగా ఇప్పిస్తానంటూ.. అందమైన అమ్మాయిలకు ఎర వేసి వారిని శారీరికంగా వాడుకుని.. అనంతరం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడి వారి నుంచి డబ్బు గుంజుతున్న ఓ ప్రబుద్దుడి కోసం బంజారాహీల్స్ పోలీసులు వేట కోనసాగిస్తున్నారు. ఇతని ఉచ్చులో అనేక మంది అమ్మాయిలు అన్యాయానికి గురయ్యారన్న వార్తలు చిత్రపరిశ్రమలో కలకలం రేపుతున్నాయి.

తాను అగ్ర దర్శకుడికి పీఏనని.. తనకు బ్యాంకు మేనేజర్లతో సన్నిహిత సంబంధాలు వున్నాయని ఎక్కడ అవసరమైతే అక్కడ అనర్ఘళంగా అబద్దాలను అడుతూ తన పబ్బం గడుపుకునే ఘనుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. అవసరాలు తీరుస్తానని నమ్మబలుకుతూ సినిమాల్లో అవకాశాల పేరుతో యువతులను.. బ్యాంకు రుణాల పేరుతో పలువురినీ మోసం చేసి.. పరారీలో వున్న మణికంఠ సాయి (25) అనే నీచుడి అన్వేషణలో పోలీసులు నిమగ్నమయ్యారు.

ఫిలిం నగర్ లోని భగత్ సింగ్ కాలనీలో నివాసం ఉంటున్న ఈ కేటుగాడు.. స్థానికంగా ఉండే కీర్తిపల్లి సత్యనారాయణశర్మతో పరిచయం చేసుకున్నాడు. బ్యాంకుల్లో తనకు పరిచయాలు బాగున్నాయని, లోన్ కావాలంటే ఇప్పిస్తానంటూ ఆయన వద్ద నుంచి రూ. 60 వేలు తీసుకున్నాడు. ఈ క్రమంలో తరచుగా ఆయన ఇంటికి వెళ్తూ, ఆయన భార్యతో వివాహేతర సంబంధం పెట్టున్నాడు. ఆ తర్వాత ఆమె కూడా మణికంఠ ఉచ్చులో చిక్కుకుంది. దీంతో సత్యనారాయణను బెదిరించడం ప్రారంభించిన మణికంఠ.. తన విషయాలను ఎవరికైనా చెప్పినా.. లేక డబ్బులు అడిగినా.. అతని భార్యతో తాను ఏకాంతంగా వున్న ఫోటోలను, వీడియోలను సామాజిక మాద్యమాల్లో పెడతానంటూ బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించాడు.

ఎవరికైనా ఫిర్యాదు చేస్తే, నీ భార్యతో పాటు ఇద్దరు కొడుకులను చంపేస్తానని బెదిరించాడు. అతని బెదిరింపులకు తలొగ్గిన సత్యానారాయణ శర్మ తన బాధను దిగమించుకుని కొన్నినెలలు భరించాడు. చివరకు విషయం ఆ నోటా, ఈ నోటా చుట్టుపక్కలవారికి తెలియడంతో.. ధైర్యం తేచ్చుకుని పోలీసులను ఆశ్రయించాడు. తన కుటుంబాన్ని నాశనం చేశాడని, తన భార్యను తనకు దూరం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. సినిమా చాన్సుల పేరుతో ఎంతో మంది యువతుల జీవితాలను నాశనం చేశాడని... అందినకాడికి డబ్బు వసూలు చేశాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో మణికంఠపై సెక్షన్ 354(ఏ), 497, 509ల కింద కేసు నమోదైంది. పరారీలో ఉన్న మణికంఠ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manikanta sai  cheating  blackmailing  jubilee hills police  hyderabad  telangana  crime news  

Other Articles