TRS MPP Gopi held for kicking woman in chest మహిళను ఎదపై తన్నిన టీఆర్ఎస్ ఎంపీపీ అరెస్టు

Trs mpp gopi held for kicking woman in chest over land dispute

immadi gopi, mandal president, Dharpally Mandal, former maoist commander, 1,125 yard plot, Vodde Rajavva, land issue, woman kicked on chest by mpp, woman slippers mpp, Indalwai village, police, viral video, social media

Nizamabad TRS Dharpally MPP president Imma-di Gopi was booked under 4 sections of IPC and arrested by the police after his video of kicking a woman during an argument over a land dispute at Indalwai village went viral on social media

ITEMVIDEOS: మహిళను ఎదపై తన్నిన టీఆర్ఎస్ ఎంపీపీ అరెస్టు

Posted: 06/18/2018 12:32 PM IST
Trs mpp gopi held for kicking woman in chest over land dispute

ఓ స్థల విక్రయం సందర్భంగా చోటు చేసుకున్న వివాదంలో బాధిత మహిళను అతిదారుణంగా అమె గుండెలపై తన కాలితో బలంగా తన్నిన నిజామాబాద్ జిల్లా దర్పల్లి ఎంపీపీ గోపీని అరెస్ట్ చేసిన పోలీసులు అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఓ భూవివాదానికి సంబంధించిన అంశంలో తనకు అన్యాయం చేసిన మండల అధ్యక్షుడి ఇంటికి వెళ్లి నిలదీస్తూ.. అతని వైఖరికి నిరసనగా ధర్నా చేపట్టింది. బాధిత మహిళను అత్యంత దారుణంగా ఎదపై తన్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్ కావడం.. న్యూస్ ఛానెళ్లు కూడా దానిని ప్రసారం చేయడంతో.. కదిలిన పోలీసులు.. అధికారిక పార్టీకి చెందిన ఎంపిపీని అరెస్టు చేశారు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. దర్పల్లి మండల అధ్యక్షుడు గోపి.. రాజీ పడిన మాజీ నక్సలైటుని సమాచారం. ప్రజలకు న్యాయం అందించే పోరాటంలో పాల్గోన్న ఈయన.. రాజీపడిన తరువాత.. నాయకుడి అవతారం ఎత్తాడు. తన పట్ల భయంతోనే, భక్తితోనే వున్న ప్రజలకు చేరువయ్యాడు. ఎంపీటీసీ అభ్యర్థిగా గెలుపొంది.. మండల అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఇక అతను ఎన్నికైంది కూడా అధికార పార్టీ నుంచే కావడం అతనికి కలసివచ్చింది. అడవుల్లో తిరిగి ఆయుధాలు చేతబట్టి ఎం న్యాయం చేశాడో తెలియదు కానీ..ఎంపీపీగా అవకాశం కలసివచ్చిన నేపథ్యంలో మండలానికి మంచి చేస్తాడని అక్కడి ప్రజలు భావించారు.

అయితే మండల విషయం పక్కనబెడితే.. మాజీ నక్సల్ గా రాజీ పడిన నేపథ్యంలో ప్రభుత్వం అతనికి ఇందల్వాయి గ్రామంలో ఇచ్చిన 1125 చదరపు గజాల ప్లాటు విషయంలో అతని నైజమేంటన్నది స్థానికులకు అర్థమైంది. ఇందల్వాయి గ్రామానికి చెందిన రాజవ్వకు చిన్న ఇంటితో పాటు తన స్థలాన్ని గత ఏడాది రూ.33 లక్షలకు విక్రయించిన ఎంపీపి గోపి.. తన ఇంటిని మాత్రం ఖాళీ చేయడంలేదు. ఈ లోగా తన ఇంటికి ఖరీదు పెరిగిందని, రూ.90లక్షలు వస్తుందని, అదనంగా తనకు కొంత డబ్బును ఇస్తేనే తన ఇంటిని ఖాళీ చేస్తానని చెప్పడంతో.. రాజవ్వ తమ బంధుమిత్రులను వెనకేసుకుని నేరుగా అతని ఇంటికి వచ్చి ధర్నాకు దిగింది.

aదీంతో బయటకు వచ్చిన ఎంపీపీ గోపి.. వారికి కట్టుకథలు చెప్పే ప్రయత్నాలు చేశాడు. ఇప్పటికే ఏడాది కాలంగా అనేక పర్యాయాలు వేడుకున్న రాజవ్వకు సహనం నశించి.. ఎంపీపీ గోపిని చోప్పుతో కొట్టింది. మరో దెబ్బ కొట్టేలోపు అమెను ఎంపీపీ ఎదపై తన్నాడు. ఈ ఘటనను అక్కడే వున్న అమె బంధువులు సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. దానిని కాస్తా సామాజిక మాద్యామాల్లో పెట్టగా అది వైరల్ అయ్యింది. కాగా, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎంపీపీ గోపీని అరెస్ట్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : immadi gopi  Dharpally Mandal MPP  Vodde Rajavva  land dispute  Indalwai village  viral video  

Other Articles