Delhi minister begins hunger strike in RajNivas రాజ్ భవన్ లో మంత్రి అమరణ దీక్ష

We have no option but to sit on dharna says arvind kejriwal

satyendar jain, minister Satyendar Jain hunger strike, Delhi Lieutenant Governor, Delhi Health Minister Satyendar Jain, Arvind Kejriwal, Delhi Chief Minister Arvind kejriwal, lieutenant governor Anil Baijal, Anil Baijal, Chief Secretary Anshu Prakash, Anshu Prakash, doorstep delivery of ration, PM Modi, Delhi, AAP, BJP, politics

Delhi CM Arvind Kejriwal and his cabinet colleagues, who spent the night at the lieutenant governor's office, today dug in their heels with Health Minister Satyendar Jain beginning an indefinite hunger strike to press for their demands.

రాజ్ నివాసంలో మంత్రి అమరణ దీక్ష.. కనుకరించని గవర్నర్

Posted: 06/12/2018 03:42 PM IST
We have no option but to sit on dharna says arvind kejriwal

దేశ రాజధాని ఢిల్లీకి రాష్ట్ర హోదా లేకపోవడంతో.. అక్కడి ప్రజాప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ముందస్తుగా అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ అమోదం తప్పనిసరి. అయితే గవర్నర్ లు కేంద్ర ప్రభుత్వ నియమించే వ్యక్తులే వుంటారు. దీంతో ఢిల్లీలోని ప్రభుత్వంపై తమ అదుపాజ్ఞల్లో వుండే గవర్నర్లతో కేంద్రం కేంద్రపరిపాలిత ప్రాంతాల్లో హవా చలాయించే అవకాశముంది. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలపై గవర్నర్ అజమాయిషీయే అధికంగా పనిచేయడంతో.. ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం పరఢవిల్లడం లేదనే చెప్పాలి.

అయితే ప్రజా ప్రభుత్వాలు కానీ, కేంద్రం దయాధర్మంతో గవర్నర్లు అయినా వారు కానీ కేవలం ప్రజాహితం కోసమే అలోచిస్తే అసలు ఏ వివాదం తలెత్తే అవకాశం వుండదు. కానీ కేంద్రంలో ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం, రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ప్రభుత్వం వుంటే.. ఇక గవర్నర్లు కేంద్ర చెప్పిన దానికే మొగ్గుచూపడం పరిపాటి. ఇలానే ఉంది ఇప్పుడు పరిస్థితి. దీంతో గవర్నర్ ను కలిసి చర్చించేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి సహా ముగ్గురు మంత్రులు రాజ్ నివాస్ లోని వెయిటింగ్ హాల్ లోనే 24 గంటలుగా గవర్నర్ అనీల్ బైజాల్ కోసం నిరీక్షిస్తున్నా.. గవర్నర్ మాత్రం వారితో మాట్లాడటానికి చోరవ చూపడం లేదు.

తమ నిర్ణయాలపై అమోదముద్ర వేయించుకునే పనిలో భాగంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి నిన్నసాయంత్రం రాజ్ నివాస్ కు వెళ్లారు. అయితే వాటిని నిర్ధ్వందంగా గవర్నర్ తోసిపుచ్చారు. దీంతో వాటిని అమోదించే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని సీఎం సహా నేతలు భీష్మించుకుని కూర్చున్నారు. సీఎం ప్రస్తావించిన మూడు డిమాండ్లలో ఒకటి విధులకు హాజరుకాని ఐఏఎస్ అధికారులపై చర్యలు తీసుకోవడం.. రెండవది పేదలకు ఇంటి గడపలకు రేషన్ సరుకులు వెళ్లడం.. వంటి నిర్ణయాలు వున్నాయి.

ఎల్జీ అభ్యంతరం తెలపడంతో వాటికి ఆమోదం తెలిపేవరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని మంత్రులు రాజ్ నివాస్ లోని వెయిటింగ్ హాల్ లోనే వుండిపోయారు. నిన్నటి నుంచి అక్కడే వున్న సీఎం, మంత్రులతో కనీసం ఎల్జీ చర్చించేందుకు కూడా ముందుకు రాకపోవడంతో ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజ్ నివాస్ లోనే ఆమర నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష తనకు తానుగా చేయలేదని, ఢిల్లీ ప్రజల కోసం చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని పేదల ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు తరలించడం ఇష్టంలేనట్లుగా వుందని అయన విమర్శించారు.

గత ఫిబ్రవరి 21 న ఆప్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో, సీఎం సమక్షంలోనే తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఐఏఎస్‌ల నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు. ఒకవేళ, వీరిపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా భయపడాల్సిన అవసరం లేదని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు జారీ చేయడం కొత్త వివాదానికి దారితీసింది. దీంతో విధులకు హాజరుకాని అధికారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు.

గవర్నర్ వైఖరికి నిరసనగా రాజ్ నివాస్ లోని సీఎం సహా మంత్రులు ధర్నాకు దిగడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీకి రాష్ట్ర హోదాను కల్పిస్తే.. ఢిల్లీ ప్రజల ఓట్లన్నీ బీజేపి ఖాతాలోకే వెళ్లేందుకు తాను ప్రచారం చేస్తాననన్నారు. అయితే ఢిల్లీలో తమ పాలన సాగుకుండా ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, అవినీతి నిరోధక శాఖలను తమ మంత్రులపైకి ఉసిగొల్పుతున్నారని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇక ఇక్కడ బీజేపి, కేంద్రప్రభుత్వం వేషాలు చూస్తున్న దేశ ప్రజలు బీజేపి ఢిల్లీని వీడివెళ్లాలని కూడా అకాక్షిస్తున్నారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aam Aadmi Party  Arvind Kejriwal  Satyendar Jain  Anil Baijal  Anshu Prakash  Delhi politics  

Other Articles