Speaker accepts YCP MPs resignations ప్రత్యేకహోదా కోసం వైపీసీ ఎంపీల రాజీనామాలు అమోదం

Speaker asks re conformation letter from ycp mps to accept their resignations

lok sabha speaker, sumitra mahajan, ysr congress mps, mekapati, vara prasad, avinash reddy, mithun reddy, bjp, tdp, chandrababu naidu, lokesh, andhra pradesh politics, andhra politics

Lok Sabha Speaker had finally accepted the resignations of the YSR Congress MPs on Wednesday. While a notification is awaited from the Speaker’s office on the resignations.

ప్రత్యేకహోదా కోసం వైపీసీ ఎంపీల రాజీనామాలు అమోదం

Posted: 06/06/2018 04:15 PM IST
Speaker asks re conformation letter from ycp mps to accept their resignations

రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరికి నిరసనగా తమ పదవులకు రాజీనామాలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలు రమారమి అమోదం పోందినట్లే. ఇవాళ వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలూ తమ రాజీనామాలను ఆమోదించాలని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను మరోమారు కోరారు. తమ రాష్ట్రానికి హోదా కల్పించే విషయంలో కేంద్రం తమ నిర్ణయాన్ని పునరాలోచించిన పక్షంలోనే తాము తమ నిర్ణయంపై అలోచిస్తామని, లేని పక్షంలో తాము ఎట్టి పరిస్థితుల్లో రాజీనామాల నుంచి వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ మహాజన్ ఎంపీలను ఈ మేరకు రీ కన్ఫర్మేషన్ లేఖలను ఇవ్వాలని కోరారు. అవి అందిన తరువాత వారి సభ్యత్వాలను రద్దు చేస్తామని కూడా చెప్పారు.

అంతకుముందు స్పీకర్ మహాజన్ వైసీపీ ఎంపీలతో మాట్లాడుతూ.. "భావోద్వేగాలతోనే మీరు రాజీనామాలు చేసి ఉంటారని భావిస్తున్నా" అన్నారు. దీనిపై స్పందించిన ఎంపీలు, తామేమీ తొందరపడి రాజీనామాల నిర్ణయం తీసుకోలేదని, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. దీంతో లిఖితపూర్వకంగా అదే విషయాన్ని తనకు తెలియజేయాలని ఆమె చెప్పడంతో, మరికాసేపట్లో రీకన్ఫర్మేషన్ లేఖలను ఇవ్వనున్నామని ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మీడియాకు తెలిపారు. దీంతో వైసీపీ ఎంపీల రాజీనామాలను సుమిత్రా మహాజన్ ఆమోదిస్తారని ప్రచారం మాత్రం జోరందుకుంది.

ఇక తమ రాజీనామాలు ఆమోదం పొందినట్టేనని మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ మారిన ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ ను కోరామని చెప్పారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఇద్దరు ఎంపీలపై ఫిర్యాదులు అందినట్టు స్పీకర్ చెప్పారని తెలిపారు. ప్రత్యేక హోదాను సాధించే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తాము నమ్ముకున్నామని, విలువలను అమ్ముకోలేదని వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు. రాజీనామాలపై టీడీపీ నేతల సర్టిఫికెట్ తమకు అవసరం లేదని అన్నారు. సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని మరో ఎంపీ వరప్రసాద్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : lok sabha speaker  sumitra mahajan  ysr congress mps  ys jagan  andhra pradesh  politics  

Other Articles